Connect with us

Achievements

తెలంగాణ గవర్నర్ సత్కారాన్ని అందుకున్న NRI సరోజా అల్లూరి, Mrs. Asia USA

Published

on

Processed with MOLDIV

Los Angeles NRI సరోజా అల్లూరి శ్రీమతి ఆసియా యుఎస్ఏ (Mrs. ASIA USA 2023) విజేతగా ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ కిరీటాన్ని గత 2022 నవంబర్ లో పొందిన సంగతి అందరికి తెలిసిందే. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళగా కూడా అప్పట్లో రికార్డులకెక్కారు. ఈ వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

దీంతో ఈ మధ్య ఇండియా వెళ్లిన సరోజా అల్లూరి కి తెలంగాణ రాజ్‌భవన్‌ (Raj Bhavan) నుంచి ఆహ్వానం అందింది. ఆహ్వానం మేరకు వెళ్లిన సరోజా ని తెలంగాణ (Telangana) రాష్ట్ర గౌరవనీయ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ప్రశంసా పత్రంతో అభినందించి, మెమెంటో మరియు పుష్పగుచ్చంతో సత్కరించారు.

గౌరవ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Mrs. Asia USA పోటీల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కిరీటాన్ని గెలుచుకున్న సరోజా అల్లూరి (Saroja Alluri) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh), విశాఖపట్నం (Visakhapatnam) వాసి కావడం విశేషం.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సరోజా ప్రస్తుతం కాలిఫోర్నియా (California) లోని లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నారు. ఈ సందర్భంగా సరోజా అల్లూరి తన సంతోషాన్ని NRI2NRI.COM తో పంచుకున్నారు. ఇదొక మరిచిపోరాని ప్రత్యేక అనుభూతి, గౌరవం అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected