Connect with us

Movies

క్లాప్ సినిమా రివ్యూ

Published

on

చిత్రం: క్లాప్
భాష: తెలుగు, తమిళం
దర్శకుడు: పృద్వి ఆధిత్య
నటీనటులు: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, నాజర్, ప్రకాశ్ రాజ్, కృష్ణ కురుప్, బ్రహ్మాజీ తదితరులు
విడుదల: మార్చ్ 11, 2022, ఒ.టి.టి

మొదటి మాట: తెర ముందు కదిలే చలనచిత్రం కాలంలో కరిగిపోతుంది. ప్రేక్షకుడిని తెరమీదకు తీసుకొని వెళ్ళడమేకాకుండా, సినిమాతో పాటు మనం ప్రయాణించే సినిమా కలకాలం నిలుస్తుంది అన్నమాటని నిజం చేసిని క్లాప్ కి నిజంగా క్లాప్స్ కొట్టాల్సిందే.

కథ: ఒక మాజీ అంగచ్ఛేద క్రీడాకారుడు ఒక పల్లెలో ఉన్న అమ్మాయిని జాతీయస్థాయి క్రీడాకారిణిగా మలచడమే మూల కదాశం.

దర్శకత్వం: అరంగ్రేటంలోనే అదరగొట్టిన పృద్వి ఆధిత్య గురించి ఎంత చెప్పిన తక్కువే. దర్శకత్వమే కాకుండా క్లాప్ కి కధాశం కూడా వీరిదే. కధలే కొన్ని సినిమాలకు హిరోలు అనడానికి ఈ సినిమా కూడా ఒక ఉదాహరణ. కధలో పట్టు, టేకింగ్లో గ్రిప్, మనసుకు హత్తుకొనే సన్నివేశాలు మరియు హృద్యంగా కదిలించే చిత్రికరణ.

సంగీతం: ఇళయరాజ సంగీత ప్రపంచంలో మన సౌత్ ఇండియాకి ఆయన వరం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాజిక్ గా కట్టిపడేసిన తీరుకి మరొక్కసారి క్లాప్స్.

సినిమాటోగ్రఫి: ప్రవీణ్ కుమార్ చిత్రీకరణ మరొక్కసారి మళ్ళీ క్లాప్ కొట్టాలి అని అనిపించేట్టుగా ఉంది.

కళాకారుల పని తీరు: ఆది పినిశెట్టి 2006 లో మొదటి సినిమాతో అడుగుపెట్టి ఉత్తమ ప్రతికధానాయకుడిగా మరియు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డ్స్ గెలుచుకొన్నా, నా వరకు ప్రేక్షకుడి హృదయాలను కట్టిపడేసిన సినిమాగా క్లాప్ నిలుస్తుంది అంటే సందేహంలేదు. ఒక వికలాంగుడిగా ఆయన నటించిన తీరు అద్బుతం. ఎంతో పరిణితి చెందిన ఒక సీనియర్ నటుడిలా పాత్రలో ఒదిన తీరుకి ఆది కి మాత్రం మనసుతో క్లాప్ కొట్టాల్సిందే. క్లాప్ కొట్టాల్సిన సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. ఒ.టి.టిలో ప్రచారమౌతున్న క్లాప్ సినిమాని అభినందించడం అంటే మరిన్ని సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమాలను ఆహ్వనించడమే.

చివరిమాట: సహజత్వానికి దగ్గరగా కథలో కదిలించే సన్నివేశాలకు క్లాప్ కొట్టాల్సిందే.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

సురేష్ కరోతు

error: NRI2NRI.COM copyright content is protected