ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఈ చిత్రాన్ని చూస్తే రక్తం మరగని భారతీయుడు ఉండడు. ఇది అధికార గర్వమో ఏమో మరి. ఇంతకన్నా మదమెక్కిన పని ఇంకొకటి ఉండదేమో. మైకు దొరికితే చాలు మేరా భారత్ మహాన్ అని ఊకదంపుడు ప్రసంగాలతో ఊదరగొట్టే మోడీ గారు ఇది మీకు తగునా? అధికారం ఈరోజు ఉండొచ్చు రేపు ఊడొచ్చు ఏదీ శాశ్వతం కాదు. భరతమాత ఆత్మని క్షోభపెట్టకండి. కనీస గౌరవం ఇవ్వవలసిందిగా మనవి.