Connect with us

Government

Modi & US కమ్యూనిటీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ @ Long Island, New York

Published

on

న్యూయార్క్‌ లోని లాంగ్ ఐలాండ్‌లో నాసావు కొలీజియంలో జరిగిన ‘మోడీ అండ్ యూఎస్‌’ గ్రాండ్ కమ్యూనిటీ కార్యక్రమంలో సుమారు పదమూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం ఇకపై అవకాశాల కోసం ఎదురుచూడదు. గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం నిర్మించబడింది. ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు నిర్మిస్తున్నారు. ప్రతిరోజూ కొత్త ఐటీఐని ఏర్పాటు చేస్తున్నారు. 10 ఏళ్లలో ఐఐఐటీల సంఖ్య 9 నుంచి 25కి పెరిగింది. ఇప్పటి వరకు భారతీయ డిజైనర్ల నైపుణ్యాన్ని ప్రపంచం చూసింది. ఇకపై భారతదేశం డిజైన్ వైభవాన్ని ప్రపంచం చూస్తుందన్నారు మోదీ.

ఇక ప్రధాని ప్ర‌సంగించేందుకు వేదికపైకి వెళుతుండగా ‘మోడీ, మోడీ’ నామస్మ‌ర‌ణ‌తో స్టేడియం మారు మ్రోగింది . ‘భారత్ మాతా కీ జై!’ నినాదంతో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘నమస్తే’ కూడా లోకల్‌ నుంచి గ్లోబల్‌గా మారిందని, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకే ఈ ఘనత ద‌క్కుతుంద‌ని మోదీ అన్నారు.

“ఈ సెంటిమెంట్ మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇదే మ‌న‌ అతిపెద్ద బలం. ఈ సెంటిమెంట్ శాంతియుతంగా, చట్టాన్ని గౌరవించే ప్రపంచ పౌరులుగా ఉండటానికి మ‌న‌కు సహాయపడుతుంది. భారతదేశం ప్రపంచ ‘విశ్వ బంధు’ అని ప్రపంచాన్ని గ్రహించేలా చేస్తుంది” అని ప్ర‌ధాని మోడీ అన్నారు.

ఈ సంద‌ర్భంగా మోడీ అమెరికాలో తన మునుపటి కమ్యూనిటీ ఈవెంట్‌లను గుర్తు చేసుకున్నారు. 2014 మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో, 2016 కాలిఫోర్నియాలోని శాన్ హౌస్ లో, 2018లో హ్యూస్టన్, టెక్సాస్‌లో, 2023 వాషింగ్టన్‌లో, ఇప్పుడు లాంగ్ ఐలాండ్‌లో అంటూ మోడీ చెప్పుకొచ్చారు.

ఇరు దేశాల మధ్య వారధిగా ఉంటూ భారత్-అమెరికా బంధాన్ని బలోపేతం చేయ‌డంలో భార‌తీయ ప్ర‌వాసులు ఎంతో దోహదపడ్డార‌ని ఆయన అన్నారు. “మీరందరూ ఏడు సముద్రాలు దాటి వచ్చారు. కానీ మీ హృదయాలు, ఆత్మల నుండి భారతదేశంపై ఉన్న‌ ప్రేమను ఏదీ తీసివేయలేదు” అని ప్ర‌ధాని మోడీ చెప్పారు.

ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి ముందు జానపద గాయకుడు ఆదిత్య గాధ్వి, రాపర్ హనుమాన్‌కైంద్, సంగీత స్వరకర్త దేవీ శ్రీప్రసాద్, శాన్ డియాగోకు చెందిన సంగీత ద్వయం కిరణ్, నివీ వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

భారతదేశం డ్రోమోక్రసీ స్థాయిని చూస్తే గర్వంగా ఉంది. మన ప్రభుత్వం మూడోసారి తిరిగి వచ్చింది. భారతదేశంలో గత 60 ఏళ్లలో ఇలా జరగలేదు. మూడో టర్మ్‌లో మనం చాలా పెద్ద లక్ష్యాలను సాధించాలి. మూడింతలు బలం, మూడింతల వేగంతో ముందుకు సాగాలన్నారు. ఈ క్రమంలో పుష్పంలోని ఐదు ఆకులను (PUSHP) కలిపి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టిస్తామని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు ఆ ఐదు ఆకుల అర్థాన్ని కూడా ప్రధాని మోదీ వివరించారు.

మోదీ ప్రస్తావించిన PUSHP పదానికి అర్థం

పీ – ఫర్ ప్రోగ్రెసివ్ ఇండియా

యూ – ఫర్ అన్ స్టాపబుల్ ఇండియా

ఎస్ – ఆధ్యాత్మిక భారతదేశం కోసం(స్పిరిచువల్ ఇండియా)

హెచ్ – భారతదేశం హ్యుమానిటీ ఫస్ట్‌కు అంకితం చేయబడింది

పీ – సంపన్న భారత్ కోసం

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన తొలి భారత ప్రధానిని నేనే అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలో ‘ దేశం కోసం చావలేమని, దేశం కోసం తప్పకుండా బతకగలమని అన్నారు. నా మనస్సు, లక్ష్యం మొదటి నుంచి చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను స్వరాజ్యం కోసం నా జీవితాన్ని ఇవ్వలేను, కానీ సంపన్నమైన భారతదేశం కోసం నా జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. సముద్రతీరం నుంచి పర్వతాల వరకు, ఎడారి నుంచి మంచు శిఖరాల వరకు, నా దేశం సవాళ్లను నేను ప్రత్యక్షంగా అనుభవించానని పేర్కొన్నారు.

ఇంకా , ఒక దశాబ్దంలో 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పుడు భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. మీరు ఇబ్బంది పడను అంటే ఇంకొక మాట చెబుతా , ఈరోజు భారతదేశం 5G మార్కెట్ అమెరికా కంటే పెద్దదిగా మారింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ కమ్యూనిటీకి గుడ్ న్యూస్‌లు చెప్పారు . తాజాగా బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో రెండు కొత్త కాన్సులేట్లను భారత్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ నగరాల్లో కాన్సులేట్ ఆఫీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ అమెరికన్స్‌ చాలా రోజులుగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోదీ చొరవతో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్, అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌లలో ఆరు ఇండియన్ కాన్సులేట్లు ఉన్నాయి.

ఈ కార్యక్రమము లో డా| విజయ్ చౌథైవాలె, కృష్ణా రెడ్డి , అడపా ప్రసాద్ , గణేష్ రామకృష్ణన్, మంజునాథ్ , నిర్మల రెడ్డి , విలాస్ రెడ్డి జంబుల , శరత్ వేముల , సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల , మధుకర్ , శ్రీనివాస్ నాతి , రాజు, కృష్ణా గుడిపాటి, దిగంబర్, రఘు శర్మ శంకరమంచి , హనుమంత్ పదార్థి, భీమా పెంట , శ్యామ్ ఏనుగంటి, వినయ్ ఇతర కమ్యూనిటీ లీడర్లు , తెలుగు , తెలంగాణ , తమిళ , కన్నడ , పంజాబీ సంఘాలు పెద్దఎత్తున పాల్గొన్నాయి.

error: NRI2NRI.COM copyright content is protected