St. Louis, Missouri: సెయింట్ లూయిస్, అమెరికాలో జరిగిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు కూన రవి కుమార్ గారు (అమదాలవలస) మరియు కందుల నారాయణ రెడ్డి గారు (మార్కాపురం).
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) యొక్క ఘనమైన చరిత్ర, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ విశ్లేషించారు. అలాగే, ఇటీవలి ఎన్నికల్లో NRI TDP పోషించిన కీలక పాత్ర, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే వ్యూహాలు, మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గ్లోబల్ తెలుగువారి పాత్ర వంటి ముఖ్యమైన అంశాలపై పార్టీ కార్యకర్తలతో చర్చించారు.
పాలన, పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల్లో NRIల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో వారు ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఐక్యంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవిష్యత్‌ను తీర్చిదిద్దగలమని చంద్రబాబు గారి విశ్వాసాన్ని వారు వివరించారు.
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సువర్ణ పాలన కోసం చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో NRI TDP కీలక భాగస్వామ్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ పుట్టిన నేల కోసం సహాయంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకలో టీడీపీ నాయకులు కిషోర్ యార్లగడ్డ (St. Louis TDP President), చెంచు వేణుగోపాల్ రెడ్డి (NRI TDP అధికార ప్రతినిధి), రజినీకాంత్ గంగవరపు (TDP Senior Leader), రాజ సూరపనేని (TDP Regional Coordinator), కిషోర్ యర్రపోతేనా, సురేంద్ర బైరపనేని, శేషు, వెంకట్ గౌని, రవి పోట్ల, రామ్ కుమార్ లావు, విజయ్ బుడ్డి, సురెన్ పాతూరి, అలాగే తెలుగు అసోసియేషన్ St. Louis సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.