Connect with us

Politics

Germany లో మినీ మహానాడు మే 24, 25న; పోస్టర్ ఆవిష్కరణ, NTR కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం

Published

on

Frankfurt, Germany: మహానటుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 102వ జయంతిని (Birth Anniversary) పురస్కరించుకొని జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ (Frankfurt) లో ఈ నెల 24, 25 తేదీల్లో మినీ మహానాడు (Mini Mahanadu) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించిన జర్మనీ ఎన్నారై తెదేపా (NRI TDP) నేతలు… ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహానాడు సమన్వయకర్తలు శ్రీకాంత్ కుడితిపూడి (Srikanth Kudithipudi) మరియు శివ (Siva) మాట్లాడుతూ…. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra), శాసనసభ్యురాలు గౌతు శిరీష (Gouthu Sireesha), గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.

టీడీపీ జర్మనీ (TDP Germany) అధ్యక్షులు పవన్ కుర్రా (Pawan Kurra) మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటారు. అందుకే ఈసారి మినీ మహానాడు (Mini Mahanadu), ఎన్టీఆర్ 102 జయంతి (NTR 102nd Birth Anniversary) వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

టీడీపీ జర్మనీ ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి (Sumanth Korrapati) మాట్లాడుతూ.. యూరప్ (Europe) లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభిమానులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొదటగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభంకానుందని, అనంతరం ఎన్టీఆర్ (NTR) కు ఘన నివాళితో పాటు వివిధ సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి మృతులకు సంతాపం, చనిపోయిన తెదేపా కార్యకర్తలకు నివాళి, చరిత్రాత్మక విజయంలో భాగస్వాములైన వారికి కృతజ్ఞతలు, ఎన్ఆర్ఐ (NRI) లకు ప్రత్యేక సెల్, అన్న ఎన్టీఆర్ కు భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలి, పద్మభూషణ్ (Padma Bhushan) అందుకున్న బాలకృష్ణ (Balakrishna) గారికి అభినందనలపై తీర్మానాలు చేయనున్నారు. తెలుగు రుచుల్ని అతిథులకు ప్రత్యేకంగా వడ్డించనున్నారు.

ఈ కార్యక్రమంలో నరేంద్ర నాదెండ్ల (Narendra Nadendla), రాజశేఖర్ పార్నపల్లి (Rajasekhar Parnapalli), అశోక్ గాండ్ల, దినేష్ కోవి, వంశీ ఉండవల్లి, వంశీ మన్నం, నరేంద్ర మనుపాటి, అనుదీప్ మేదరమెట్ల తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected