అమెరికాలో ఎన్నారై టీడీపీ (NRI TDP) మరియు జనసేన (Janasena) సంయుక్తంగా ‘ఛలో ఇండియన్ కాన్సులేట్’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. బే ఏరియా లోని ఎన్నారైలు డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో కి మెమోరాండం సమర్పించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఎన్నారైలు (NRI) పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేశారు.
ఇక టీడీపీతో జనసేన కూడా పొత్తు పెట్టుకోవడంతో తెలుగు తమ్ముళ్లకు జనసైనికులు కూడా తోడై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఎన్నారై టీడీపీ-జనసేన సంయుక్తంగా ‘ఛలో ఇండియన్ కాన్సులేట్, శాన్ ఫ్రాన్సిస్కో’ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
బే ఏరియా (Bay Area) లోని ఎన్నారైలు డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) కి మెమోరాండం సమర్పించారు. ఎన్నారైలు సమర్పించిన మెమోరాండంను భారత ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్‌కు పంపుతానని డిప్యూటీ కాన్సుల్ తెలిపారు.
ఈ వారం నిరసనల్లో భాగంగా ఎన్నారై టీడీపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ, ఎన్నారై జనసేన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ‘వి స్టాండ్ విత్ సీబీఎన్’ అంటూ నినాదాలు చేశారు.