Connect with us

Cricket

Mega Cricket Tournament లో సత్తా చాటిన ర్యాలీ యువత: TANA Raleigh Chapter

Published

on

క్రికెట్ అంటే భారతీయులకు మక్కువ. అది ఇండియా అయినా లేదా అమెరికా అయినా. అందుకే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), నార్త్‌ కరోలినా రాష్ట్రం, ర్యాలీ చాప్టర్ ఆధ్వర్యంలో లేబర్ డే వీకెండ్ సెప్టెంబర్‌ 2వ తేదీ, సోమవారం రోజున మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ (Mega Cricket Tournament) పెద్ద ఎత్తున నిర్వహించారు.

అప్పుడప్పుడు వర్షం పడుతూ, వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ, తమ ప్రతిభను చాటేందుకు క్రీడాకారులు వెనుకాడలేదు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు ఈ టోర్నమెంట్‌ అప్రతిహాతంగా సాగింది. 8 మందితో కూడిన పలు టీమ్‌లు ఇన్నింగ్స్ కి 6 ఓవర్లు చొప్పున ఈ టోర్నమెంట్‌ లో ఆడారు.

డర్హం (Durham, North Carolina) లో నిర్వహించిన ఈ మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజేతగా కాంకరర్స్‌ టీమ్‌ నిలిచింది. రన్నర్స్‌ గా ట్రైడెంట్‌ జట్టును ప్రకటించారు. బెస్ట్‌ బౌలర్‌గా వంశీ కృష్ణ నార్నె, బెస్ట్‌ బ్యాట్స్‌ మెన్‌ గా అభివర్ష్‌ పెద్దిరెడ్డి, ఎంవిపిగా యశ్వంత్‌ నాగండ్ల, బెస్ట్‌ అంపైర్‌ ఉపేంద్ర నిమ్మల ఎంపికయ్యారు.

ఈ టోర్నెమెంట్‌ను విజయవంతం చేసిన వారందరికీ, తానా ర్యాలీ టీమ్‌కు, తానా అపలాచియాన్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ రాజేష్‌ యార్లగడ్డ (Rajesh Yarlagadda) ధన్యవాదాలు తెలిపారు. తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌ లో పాల్గొన్న ఆటగాళ్ళను అభినందించారు.

అలాగే గ్రౌండ్‌ ఏర్పాట్లు మరియు లాజిస్టిక్స్‌ని చూసిన వినోద్‌ కాట్రగుంట కు మరియు ప్రణాళికలు, నియమాలను రూపొందించిన వంశీ కట్టా, మిథున్‌ సుంకర, ప్రకాష్‌ బయన కు ధన్యవాదాలు తెలియజేశారు. యువ ఆటగాళ్ళ ప్రతిభకు తానా మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ (Cricket Tournament) వేదికైంది.

తానా ర్యాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ (Mega Cricket Tournament) లో తానా ఫౌండేషన్‌ ట్రస్టీ రామకృష్ణ అల్లు (Ramakrishna Allu), తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఠాగూర్ ‌మల్లినేని తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected