టీం అట్లాంటా జనసేన (Team Atlanta Janasena – TAJ) వారి ఆధ్వర్యంలో ఎన్.డి.ఎ కూటమి (బి.జె.పి, టి.డి.పి, జనసేన) నేతృత్వంలో విశాఖపట్టణం దక్షిణ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamsi Krishna Srinivas Chennuboina, Janasena) గారితో మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ఎన్.డి.ఎ మద్దతుదారులు, జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయకేతనాన్ని విజయవంతం చేశారు.
ఈ జయకేతన సభకు ముఖ్య అతిథులుగా శ్రీ బాబ్ (పరమేశ్ ఎర్రమిళ్లి) గారు (జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ మెంబర్), శ్రీ లావు అంజయ్య చౌదరి గారు (తానామాజీ అధ్యక్షులు), మధు యార్లగడ్డ (తానాఆర్.వి.పి), మహరాణ యడవల్లి (తాజ్), ప్రశాంత్ కొల్లిపర (బైట్ గ్రాఫ్), కార్తీక్ బండారు (బి.జె.పి), ప్రియాంక గడ్డం (ఆప్త) పాల్గొన్నారు.
కూటమితో ఆంధ్రకు కళ అట్లాంటాలో కూటమి పార్టీల జెండాలు రెపరెపలాడగా, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నినాదాలతో రిఫ్లెక్షన్ ఈవెంట్ హాల్ సందడిగా మారింది. సుమారు 300 మందికిపైగా అతిథులు సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి పయనంలో తమ మద్దతును తెలియజేశారు.
జనసేనాని, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి అతిథులు ప్రసంగించగా, సభికులు హర్షధ్వానాలు గలిపారు. తెలుగుదేశం అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు అభివృద్ధి దిశగా అమలు చేస్తున్న విధానాలు, ఫ్4 విసిఒన్ 2047 గురించి వివరించగా, ఎన్.డి.ఎ శ్రేణులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందిస్తున్న మద్దతును అందరూ ప్రశంసించారు.
విశాఖ దక్షిణ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి మాటల్లో.. శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamsi Krishna Srinivas Chennuboina) గారు మాట్లాడుతూ, రాబోయే నాలుగు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రాధాన్యతలు – పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, బోగాపురం ఎయిర్‌పోర్ట్, రాష్ట్రంలో రోడ్ల విస్తరణ, తాగునీటి సమస్యలు మొదలైన అంశాలపై స్పష్టమైన వివరణ అందించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.
ఇతర ముఖ్య ప్రసంగాలు
శ్రీ లావు అంజయ్య చౌదరి గారు – కూటమి చేస్తున్న కార్యక్రమాల వల్లే అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు.
శ్రీ బాబ్ గారు – సభలో తెలుగుదనం ప్రతిబింబించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
శ్రీ కార్తీక్ బండారు గారు – వారాహి డిక్లరేషన్, పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం పరిరక్షణ యత్నాలను బి.జె.పి తరఫున ప్రశంసించారు.
శ్రీ జలగం నారాయణ గారు – తెలంగాణాలో కూడా జనసేన పోటీ చేయాలని ఆకాంక్షించారు.
శ్రీ ప్రశాంత్ కొల్లిపర గారు – జయకేతన సభలో ఆడియో-విజువల్ ప్రణాళిక ఎలా రూపొందించామో వివరించారు.
కార్యక్రమ నిర్వాహణ అట్లాంటా జయకేతనానికి వాఖ్యాతలుగా సురేష్ కరోతు (Suresh Karothu) మరియు ప్రియ బత్తిన వ్యవహరించారు. తాజ్ (Team Atlanta Janasena – TAJ)వాలంటీర్లు, గడచిన వారం రోజులుగా కృషి చేసి ఈ సభను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
కుమారి జననీ – పవన్ కళ్యాణ్ గారి పాటలతో నృత్య రూపక ప్రదర్శన
కుమారి అక్షిత – పవన్ కళ్యాణ్ గారి పాటల మెడ్లీ ఆలాపన
గాయని ప్రియ బత్తిన & గాయకుడు సందీప్ – మెగా మెడ్లీ ప్రదర్శన
సభ విజయవంతం ఈ సభను విజయవంతం చేసిన ఎన్.డి.ఎ (National Democratic Alliance – NDA) కూటమి పార్టీలైన భారతీయ జనతా పార్టీ (BJP), తెలుగుదేశం పార్టీ (TDP) అట్లాంటా సభ్యులకు టీం అట్లాంటా జనసేన (Team Atlanta Janasena – TAJ) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది.