Connect with us

Government

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల తో ఆత్మీయ సమ్మేళనం విజయవంతం: NRI TDP Atlanta

Published

on

ఈ మధ్యనే ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నెల్లూరు జిల్లా, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరానికి చెందిన ప్రముఖ ఎన్నారై సురేష్ కాకర్ల (Suresh Kakarla) తో గత గురువారం ఆగస్ట్ 15న అట్లాంటా (Atlanta) లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) ఆధ్వర్యంలో స్థానిక సంక్రాంతి రెస్టారెంట్ (Sankranti Restaurant Event Hall) ఈవెంట్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన (Jana Sena Party) మరియు భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు 250 మంది పాల్గొనడం విశేషం.

వెంకి గద్దె (Venky Gadde) ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పెద్దలు, మహిళలు ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) చిత్రపఠం వద్ద దీపం వెలిగించి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అంటూ పలువురు నినాదాలు చేశారు.

ఉదయగిరి (Udayagiri Assembly Constituency) శాసనసభ్యులు సురేష్ కాకర్ల ని వెంకి గద్దె సభకి పరిచయం చేయగా, తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) తనకు సురేష్ కాకర్ల తో 14 సంవత్సరాలుగా ఉన్న అనుబంధాన్ని, అలాగే తానాకి సురేష్ (Suresh Kakarla) చేసిన సేవలను విపులంగా వివరించారు.

అలాగే ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులు మల్లిక్ మేదరమెట్ల, శ్రీనివాస్ లావు, ఎన్నారై జనసేన నాయకులు రాజు మందపాటి, సురేష్ ధూళిపూడి ఈ సందర్భంగా ఎన్నికలనాటి పరిస్థితులు, కూటమి (National Democratic Alliance – NDA) ఏర్పాటు, కౌంటింగ్ రోజు ఉత్కంఠ, ఇకపై ఏం చేయాలి తదితర విషయాలపై ప్రసంగించారు.

అలాగే మురళి సజ్జా మరియు మురళి కిలారు సురేష్ కాకర్ల తో తమకున్న స్నేహబంధం, తన సేవాదృక్పథాన్ని వివరించారు. మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ లో రామునికి లక్ష్మణుని లా సురేష్ కాకర్ల కు చేదోడు వాదోడుగా ఉన్న తమ్ముడు, ప్రముఖ వెటర్నరీ డాక్టర్ సునీల్ కాకర్ల (Sunil Kakarla) గత రెండు సంవత్సరాలుగా తాము ఎం చేసింది, ఎవరు సహాయం చేశారు వంటి విషయాలను వివరించారు.

చివరిగా మృదు స్వభావి, సేవాతత్పరతతో కాకర్ల ఛారిటబుల్ ట్రస్ట్ (Kakarla Charitable Trust) ని ఏర్పాటుచేసి నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గ (Udayagiri Assembly Constituency, Nellore) ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగిన సురేష్ కాకర్ల పలు విషయాలను సభికులతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీడీపీ, జనసేన (Janasena) నాయకులకు మరియు అట్లాంటా (Atlanta) ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. తను మొదటిసారి 2000లో అమెరికా వచ్చినప్పుడు అట్లాంటా లోనే ఉన్నానన్నారు. ముందు ముందు అట్లాంటా నుంచి కూడా పలువురు రాజకీయాలలోకి రావాలని ఆకాంక్షించారు.

ఎన్నారైలు ఉదయగిరి ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించుటకు అనువుగా ఉంటుందని, ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తోందని తెలిపారు. ఎన్నారైలు వాక్‌ విత్ ‌ ఎమ్మెల్యే (Walk with MLA) కార్యక్రమంలో పాల్గొని సమస్యలను నేరుగా చూసి సహాయం చేయవచ్చని అన్నారు.

ఎన్నారై టీడీపీ అట్లాంటా, జనసేన నాయకులు కలిసి సురేష్ కాకర్ల మరియు సునీల్ కాకర్లను శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. పలువురు సురేష్ కాకర్ల తో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. భోజనాలు అనంతరం వందన సమర్పణతో (Vote of Thanks) కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected