Connect with us

Movies

దర్శకులు సురేందర్ రెడ్డి పాన్ ఇండియా Movie, వెంకట్ దుగ్గిరెడ్డి జాక్ పాట్

Published

on

టాలీవుడ్ ప్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా (Movie) పట్టాలెక్కే దశలో ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా (Pan India Cinema) అన్నట్టు వినికిడి. ఈ సినిమాలో అట్లాంటా వాసి వెంకట్ దుగ్గిరెడ్డి జాక్ పాట్ కొట్టినట్లే. స్వయంగా దర్శకులు సురేందర్ రెడ్డి నలుగురిలో మాట ఇవ్వడమే అందుకు కారణం.

వివరాలలోకి వెళితే… దర్శకులు సురేందర్ రెడ్డి (Surender Reddy) అమెరికా యాత్రలో ఉన్నారు. ఇందులో భాగంగా గత వారం జులై 2, మంగళవారం రోజున అట్లాంటా లోని వెంకట్ దుగ్గిరెడ్డి ఇంట్లో ఆత్మీయ సమావేశం (Meet & Greet) నిర్వహించారు. అతి దగ్గిర సన్నిహితుల కుటుంబాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి ప్రసంగించారు.

చిన్న చిన్న సినిమాలలో నటించవద్దని, అలాంటి సినిమాల కోసం ఇండియా, అమెరికా మధ్య ప్రయాణించ వద్దని, తన రాబోయే సినిమాలో మంచి రోల్ ఇస్తానని ఎప్పుడో ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికంటే ముందే వెంకట్ (Venkat Duggireddy) కి డైరెక్ట్ గా చెప్పానని సురేందర్ రెడ్డి అన్నారు. మరిన్ని వివరాలు త్వరలో మీకే తెలుస్తాయని అన్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే సినిమా ద్వారా తోలి అడుగులోనే నంది అవార్డు (Nandi Award) సాధించి సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ (Tollywood) ప్రయాణాన్ని ప్రారంభించిన సురేందర్ రెడ్డి, అనతి కాలంలోనే టాలీవుడ్ లోనే అతి పెద్ద నటీనటుల సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (NTR) తో అశోక్ మరియు ఊసరవెల్లి, రవి తేజ తో కిక్ మరియు కిక్ 2, అల్లు అర్జున్ (Allu Arjun) తో రేసు గుఱ్ఱం, రామ్ చరణ్ తో ధృవ, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) తో సైరా, అఖిల్ అక్కినేని తో ఏజెంట్ లాంటి పెద్ద సినిమాల ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల జాబితాలో చోటు సంపాదించారు.

ఇక అట్లాంటా ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) విషయానికి వస్తే… ఇప్పటికే గాలోడు, మిస్టరీ, వాయుపుత్ర లాంటి పదికి పైగా సినిమాలలో నటించారు. వీటిలో కొన్ని రిలీజ్ అయ్యాయి, ఇంకొన్ని షూటింగ్ లో, మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగా, మంచు లక్ష్మి తో నటించిన సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

అలాగే హీరోయిన్ ప్రియమణి (Priyamani) నటించే ఒక సినిమాలో కూడా మంచి పాత్ర పోషించనున్నారని టాలీవుడ్ కోడై కూస్తుంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి (Surender Reddy) నెక్స్ట్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా సినిమాలో మంచి రోల్ ప్లే చేసే అవకాశం, అందునా అట్లాంటా వాసుల నడుమ దర్శకులు ప్రకటించడం విశేషం.

ఈ కార్యక్రమంలో వెంకట్ దుగ్గిరెడ్డి స్నేహితులు, సన్నిహితులు మరియు దర్శకులు సురేందర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి (Surender Reddy) ఎంతో ఓపికతో అందరితో ఫోటోలు దిగడం అభినందనీయం. వెంకట్ అతిథ్యంతో అందరూ ఉల్లాసంగా గడిపారు. చివరిగా సురేందర్ రెడ్డి తో కేక్ కట్ చేయించి రాబోయే సినిమా (Movie) కు అందరూ అభినందనలు తెలిపారు.

తెలుగు సినీ అగ్ర దర్శకులు సురేందర్ రెడ్డి (Tollywood Movie Director Surender Reddy) తో అట్లాంటా (Atlanta) లో వెంకట్ దుగ్గిరెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/Meet and Greet with Tollywood Movie Director Surender Reddy ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected