Connect with us

Politics

TDP జాతీయ అధికార ప్రతినిధి డా. జ్యోత్స్న తిరునగరి తో అట్లాంటాలో ఆత్మీయ సమావేశం విజయవంతం

Published

on

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) వేదికగా అమెరికన్ మల్టీ ఎత్నిక్ కమీషన్ పలు విభాగాలకు చెందిన 20 మంది అత్యంత ప్రభావశీలురైన మహిళలను ఎంపిక చేసి అందించే గ్లోబల్ అవార్డును అందుకునే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధికార ప్రతినిధి మరియు స్ట్రాటజీ టీం మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న తిరునగరి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) నగరంలో ఎన్నారై టీడీపీ (NRI TDP) సభ్యులతో నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో డాక్టర్ జ్యోత్స్న పాల్గొన్నారు. మార్చి 14 శుక్రవారం సాయంత్రం వేడుక బాంక్వెట్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది తెలుగుదేశం (TDP), జనసేన (Janasena) మరియు బీజేపీ (BJP) పార్టీల సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

ముందుగా వెంకి గద్దె (Venky Gadde) అందరికీ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళా నేతలు కృష్ణప్రియ, హేమ, చికాగో నుంచి విచ్ఛేసిన డా. వాసవి చక్కా మరియు డాక్టర్ జ్యోత్స్న తిరునగరి లను సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించగా మహిళలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం తెలిపారు.

కృష్ణప్రియ ఎలక్షన్స్ టైం లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇంటింటికీ తిరిగిన విషయాలు, హేమ సోషల్ మీడియా (Social Media) లో పోరాడిన తీరు, డా. వాసవి టాప్ 20 విమెన్ గ్లోబల్ అవార్డ్స్ గురించి ప్రసంగించారు. అనంతరం డాక్టర్ జ్యోత్స్న తిరునగరి జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్రారంభించి, తనదైన శైలిలో దాదాపు గంటన్నరకు పైగా అనర్ఘళంగా ప్రసంగించారు.

ప్రస్నోత్తర సమయం వరకు ఆగకుండా మధ్య మధ్యలో తెలుగు (Telugu Desam Party – TDP) తమ్ముళ్లు ప్రశ్నల వర్షంతో అంతరాయం కల్పించినప్పటికీ, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మనందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమంటూ కలుపుగోలుగా ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా, ప్రతి ప్రశ్నకి డాక్టర్ జ్యోత్స్న (Dr. Jyothsna Tirunagari) స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

కొన్ని ప్రస్తుత పరిస్థితులను అంగీకరిస్తూనే, అందరం రాష్ట్ర అభివృధ్హి కోసం, పార్టీకి మరియు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలబడాల్సిన అవసరాన్ని నొక్కి వొక్కాణించారు. ప్రభుత్వ (Government) పరంగా చంద్రబాబు, పార్టీ పరంగా నారా లోకేష్ (Nara Lokesh) తీరును సమర్ధించారు. ఎలక్షన్స్ టైములో ఎంత గట్టిగా నిలబడ్డారో ఇప్పుడు కూడా ఎన్నారైలు అంతే గట్టిగా నిలబడాల్సిన ఆవశ్యకతను సుదీర్ఘంగా వివరించారు.

Q&A సెషన్ లో పలువురు వివిధ ప్రశ్నలు అడిగి తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. మహిళలు డాక్టర్ జ్యోత్స్న తిరునగరి (Dr. Jyothsna Tirunagari) ని శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భోజనానంతరం అందరూ డాక్టర్ జ్యోత్స్న తో ఫోటోలు తీసుకొని ఆహ్లాదంగా కనిపించారు. చివరిగా వందన సమర్పణతో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected