Connect with us

Politics

రాజ్యసభ ఎంపీ Kanakamedala Ravindra Kumar తో ఆత్మీయ సమావేశం @ Bay Area

Published

on

కాలిఫోర్నియా రాష్ట్రం, బే ఏరియా లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) తో ఆత్మీయ సమావేశం Bay Area NRI TDP ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

మిల్పిటాస్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో జులై 3 సోమవారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముందుగా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ని పుష్పగుచ్చంతో సాదరంగా వేదికపైకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ స్థితిగతులకు సంబంధించి పలు విషయాలపై కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) ప్రసంగించారు. అనంతరం NRI TDP USA Coordinator జయరాం కోమటి ప్రసంగించారు.

వెంకట్ కోగంటి, చంద్ర గుంటుపల్లి, విజయ కృష్ణ గుమ్మడి తదితర తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు రవీంద్ర కుమార్ తో ఫోటోలు దిగారు. అందరూ కలిసి MP రవీంద్ర కుమార్ ని ఘనంగా సన్మానించారు.

error: NRI2NRI.COM copyright content is protected