Singapore లో దిగ్విజయంగా జరిగిన కిరణ్ ప్రభ (Kiran Prabha), కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ కార్యక్రమం. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో “కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో” ఇష్టాగోష్టి మరియు ఆత్మీయ అభినందన సమావేశం స్థానిక సరిగమ బిస్ట్రో రెస్టారెంట్, లిటిల్ ఇండియా (Little India) లో, డిసెంబర్ 18, బుధవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించబడింది.
కౌముది మాసపత్రిక సంపాదకులు, కొన్నివందల పరిశోధనాధారిత “టాక్ షో”ల ప్రయోక్త, అరుదైన ప్రతిభామూర్తి, నిత్య సాహితీపిపాసి కిరణ్ ప్రభ (Kiran Prabha) గా అందరికీ సుపరిచితులు అయినటువంటి వీరు, ఈ కార్యక్రమంలో మాట్లడుతూ సమయాభావం వల్ల ఒక్క 12 గంటలు మాత్రమే సింగపూరులో అవకాశం దొరికింది.
వారం మధ్యలో అందరూ ఆఫీసులకు వెళ్ళే సమయం అయినా కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (Ratna Kumar Kavutur), సుబ్బు వి పాలకుర్తి (Subbu V Palakurthy) కి ధన్యవాదములు తెలియజేసారు. అలాగే కౌమిది వెబ్ మాగజైన్ మొదలు పెట్టి 17 సంవత్సరాలు పూర్తి అయింది.
ఏ నెలా ఆలస్యం కాకుండా 1వ తేదీనే విడుదల అవ్వడం వెనుక ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అది మనకు పని పట్ల ఉన్న నిభద్దతగా భావించి విడుదలలో జాప్యం రానివ్వమని అన్నారు. అలాగే దాదాపు 1300 టాక్ షో (Talk Show) లను కూడా నిర్వహించామని, తెలిసినంతలో ఒక్క మన తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని రకరకాల సబ్జక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని తెలియజేశారు.
అంతే కాకుండా ఇదంతా ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అబిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. అదే విధంగా వారి టాక్ షో (Talk Show) లను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే క్రమం ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు.
అదే విధంగా కౌముది పత్రిక నిర్వహణలో భార్య కాంతి కిరణ్ సహాయసహకారాలు ఎలా ఉంటాయో వివరించారు. కాంతి కిరణ్ మాట్లాడుతూ కౌముది (Koumudi) పత్రిక ప్రారంభించినప్పుడు ఇంతమంది అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా మాకు అందిస్తుందని అస్సలు అనుకోలేదని, ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
తదుపరి వచ్చిన ఆహూతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు.సుబ్బు వి పాలకుర్తి సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమములో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు ప్రసంగించారు.
రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ కిరణ్ ప్రభతో గత 3 సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికలు ద్వారా పరిచయం ఉన్నప్పటికీ వారిని సింగపూర్ లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమములో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెపుతూ వారిని పరిచయం చేసిన తానా (TANA) సాహిత్య సంఘం అధ్యక్ష్యులు తోటకూర ప్రసాద్ (Dr. Prasad Thotakura) కి ధన్యవాదములు తెలియచేసారు.
అలాగే సింగపూర్ (Singapore) లో సాహిత్య కార్యక్రమాలకు నాంది పలికిన వంగూరి చిట్టెన్ రాజు (Vanguri Chitten Raju) కి మరొక్కసారి ధన్యవాదములు తెలియచేస్తూ, వర్కింగ్ డే అయినా కానీ 30 మందికి పైగా ఈ కార్యక్రమములో పాల్గొనటం అది కేవలం కిరణ్ ప్రభ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని తెలిపారు.ఈ కార్యక్రమములో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్ష్యులు జవహర్ చౌదరి (Jawahar Chaudhary), రంగా రవికుమార్ (Ranga Ravikumar), సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమములో పాల్గొన్న అతిధులందరికి విందు భోజన ఏర్పాట్లను సరిగమ బిస్ట్రో రెస్టారంట్ వారు కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల ఏర్పాటు చేసారు.