Connect with us

News

Meet & Greet with MP Kanumuru Raghu Rama Krishna Raju @ California – RRR

Published

on

కాలిఫోర్నియా రాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో లోక్ సభ ఎంపీ కనుమూరు రఘు రామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. బే ఏరియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

జులై 2 ఆదివారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముందుగా పీపుల్స్ లీడర్ కనుమూరు రఘు రామ కృష్ణం రాజు (RRR) ని పుష్పగుచ్చంతో వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు విషయాలపై RRR (Kanumuru Raghu Rama Krishna Raju) ప్రసంగించారు. అనంతరం అందరూ కలిసి రఘు రామ కృష్ణం రాజు ని ఘనంగా సన్మానించారు. పలువురు RRR తో ఫోటోలు దిగారు.

ఈ కార్యక్రమంలో రాజ్య సభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, జయరాం కోమటి, భక్త బల్లా, వెంకట్ కోగంటి, విజయ కృష్ణ గుమ్మడి, భారత్ ముప్పిరాల తదితరు తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected