గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (Greater Atlanta Telangana Society – GATeS) కార్యవర్గ మరియు బోర్డు సభ్యుల సమావేశం ఫిబ్రవరి 24న స్థానిక బిర్యానీ పాట్ రెస్టారెంట్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో బోర్డు అడ్వైసరీ సభ్యులు, చైర్స్, కో-చైర్స్, పలు కమిటీల సభ్యులు మరియు స్పాన్సర్స్ కూడా పాల్గొన్నారు.
ఎంతో తోడ్పాటు అందిస్తున్న వివిధ స్పాన్సర్స్ ని గేట్స్ అధ్యక్షులు జనార్దన్ పన్నెల (Janardhan Pannela), చైర్మన్ శ్రీనివాస్ పర్సా (Srinivas Parsa) సభకి పరిచయం చేసి సత్కరించారు. గేట్స్ పూర్వ బోర్డు అధక్షులు మరియు బోర్డు సభ్యుల సేవలని కొనియాడుతూ, వారు అందిస్తున్న సహాయ సహకారాల్ని సభ కి వివరించి సగౌరవంగా సత్కరించారు.
గేట్స్ (GATeS) బోర్డు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సభికులని ఎంతగానో ఆకట్టుకున్నాయని, తమ సహకారం ఎల్లవేళలా గేట్స్ కి అందిస్తాం అని స్పాన్సర్స్ (Sponsors) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సేవలని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని గేట్స్ సభ్యులు చేస్తున్న కృషిని గుర్తించి నూతనంగా మరికొంత మంది గేట్స్ కి స్పాన్సర్ చేయడానికి ముందుకు రావడం విశేషం.
ఈ కార్యక్రమంలో గేట్స్ సేవాకార్యక్రమాల (Service Activities) వివరాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. గేట్స్ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో మందికి తమ సేవా మార్గం ప్రేరణ అవడానికి ఈ సమావేశం ఒక ఉదాహరణ అని సభికులు కోయాడారు. 2023 లో నిర్వహించే అన్ని కార్యక్రమాల క్యాలండర్ని సభలో వివరించారు.
పలు జాతీయ, స్థానిక తెలుగు సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. భోజనం అనంతరం వందన సమర్పణతో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) కార్యవర్గ మరియు బోర్డు సమావేశం విజయవంతంగా ముగిసింది.