NRI TDP మహానాడుతో తెలుగు ఆత్మీయత ప్రపంచానికి చాటిన బోస్టన్ తెలుగు తమ్ముళ్లతో మాజీ మంత్రి దేవినేని ఉమ గారి మీట్ అండ్ గ్రీట్ సెప్టెంబర్ 2న విజయవంతంగా జరిగింది. మహా సముద్రాలు దాటి మరో ఖండంలో మనుగడసాగిస్తూ జన్మభూమిని మరువక NRI TDP న్యూ ఇంగ్లాండ్ 2022 మహానాడుని మహోన్నతంగా నిర్వహంచి తెలుగుజాతిని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అన్న NTR ని స్మరిస్తూ, అందరిని అబ్బురపరుస్తూ అంబరాన్ని తాకిన విషయం అందరికీ విదితమే.
మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వర రావు అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్ విచ్చేసిన సంధర్భంలో NRI TDP Boston విభాగం నిర్వహంచిన్ మీట్ & గ్రీట్ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖా మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు గారు అభిమానులు మరియు సానుభూతిపరులతో సమావేశం అయ్యారు .
నూట యాభై మందికి పైగా TDP అభిమానులు విచ్చేసి అన్న ఎన్ టి ఆర్, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు, కృషీవలుడు ఉమాగార్లపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటినారు. ఆంధ్ర అభివృదిికై ఐదు సంసత్సరాలలో అవిశ్రాంతిగా TDP ప్రభుత్వం చేసిన అవిర్ళ కృషిని మాజీ మంత్రివర్యులు సభ్యులకు వివరించారు.
ఎన్నారైలు కూడా తమ నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఓటర్ వెరిఫికేషన్ చేయంచాలని, స్వింగ్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఇప్పటి నుంచే క్రమపద్ధతిలో కార్యాచరణ చేయ్యాలని పిలుపునిచ్చారు. ఎన్నారైటీడీపీ.కామ్ లో రెజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
తెలుగు తమ్ముళ్లు ఎందరో ప్రసంగించారు. వారం వారం పోలవరం అంటూ ఆంద్రాలోని ప్రతిసీమకు నీరు అందించాలని పట్టు పట్టి పట్టి సీమను పూర్తి చేసి పోలవర్ం పూర్తికై పరుగులు పెట్టించిన ఆంద్రా భగీరధుడు దేవినేని మహేశ్వర రావు గారిని కొనియాడారు.
దేవినేని ఉమాగారిని సన్మానించాలని తమ్ముళ్లు సంకల్పిస్తే ఆయన నాకు కాదు ఇక్కడకు విచ్చేసిన 83 సంవతసరాల పెద్దమ్మను మనం సన్మానించాలని, అందరిని దగ్గరికి పిలిచి ఒక అమ్మను గౌర్వించటం TDP సంస్కారం అని అనడం విశేషం. అన్న NTR మరియు చంద్రన్న నేర్పిన TDP క్రమశిక్షణ అందరిని ఆకట్టుకుంది.
చరిత్రలో యదార్ధ గాథలో చదివి వున్నాము, అబద్ధాల పునాదులపై నిర్మించిన కోటలు బీటలు వరకు వారక తప్పదు. ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, అమరావతి నగరాన్ని భూతలంపై ఆవిష్కరించడం కోసం, పోలవరాన్ని భారతావని కోసం ఒక వరంగా ఇచ్చేందు కోసం తెలుగుదేశం రావాలి మన దశ దిశ మారాలని అందరూ ఆకాక్షించారు.