Connect with us

Politics

OFBJP @ New Jersey: బండి సంజయ్ తో ఆత్మీయ సమ్మేళనం

Published

on

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ గారు పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్ర‌భుత్వం విమోచన దినోత్సవం జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని ఈ సంద‌ర్బంగా బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని, అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్‌ విస్మరించటం తగదు అని హెచ్చరించారు.

విమోచన దినం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేన‌ని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామ‌ని తెలిపారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తరుపున తెలంగాణలోజరుగుతున్న అభివృద్ధి తప్ప, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అవినీతి తప్ప అభివృద్ధి లేదని తేల్చి చెప్పారు. ఎన్ఆరైలు అందరు ఎన్నికలప్పుడు భారత దేశానికి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.

ఇండియాను భార‌త్‌గా ప్రస్తావించాల‌ని ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ కోరారు. దీనికి బీజేపీ మ‌ద్ద‌తుదారులు, ఎన్నారైలు స్వాగ‌తించారు. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం సుస్మా స్వరాజ్ గారు. తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం చనిపోతూ ఉంటె , మీరు చనిపోవద్దు, మీ బలిదానాలు వద్దు, తెలంగాణ వస్తది, వచ్చిన తెలంగాణ ను మీరు బతికి ఉండి చూడాలి అని సుస్మా స్వరాజ్ చెప్పారు అని గుర్తు చేసారు బండి సంజయ్.

అవినీతి నిర్మూలన, విద్య వ్యాప్తి, గ్రామీణా నీటి సరపరా, తాగు, సాగు నీటి ప్రాజెక్ట్లు , అవసరముంది అని అన్నారు. గ్రామిణా ప్రాంతం లో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తు సరపరా, టాయిలెట్స్ నిర్మించడం, విద్యార్థులకు వసతి గృహాల సదుపాయం, బలహీన వర్గాలకి పక్క గృహా సదుపాయం వంటి నిత్యావసర పనులను సాదించినపుడు బంగారు తెలంగాణా ను సాదించగలమని తెలియచేసారు.

కేంద్ర ప్రబుత్వం తెలంగాణా అభివృద్ధి కోసం ఏ రకంగా సహకరిస్తుంధో తెలియచేస్తూ , స్మార్ట్ సిటీస్ ని ఏరకంగా అభివృద్ధి పరచవచ్ఛో తెలియజేసారు. దీని కోసం BJP / కేంద్ర ప్రభుత్వం / మోడిగారు అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి కోసమా కేంద్ర , రాష్త్రా ల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలని వెల్లడిస్థ్హూ , తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణా ప్రవాస భారతీయులు ని సహక రించాలిసేందిగా విజ్ఞప్తి చేసారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని ప్రకటించడాన్ని తెలంగాణ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు, అని తెలిపారు మరియు కేసీఆర్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా.. వీరుల త్యాగాలను మజ్లిస్‌ పార్టీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. దీనిని తెలంగాణ ప్రజలు మరిచిపోరని, ఈ అవకాశవాద రాజకీయాలకు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

సనాతన ధర్మం యొక్క గొప్ప తనాన్ని, అయోధ్య రాముడి గురించి , ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 , జమ్మూ కాశ్మీర్ యొక్క వాస్తవ పరిస్థితులు తెలిపారు. ఈ కార్యక్రమములో అఫ్-బీజేపీ పూర్వ అధ్యక్షులు కృష్ణారెడ్డి అనుగుల మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాలలో బండి సంజ‌య్ గారు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ తరుపున ఐదు పబ్లిక్ మీటింగ్లు లో ప్రవాస భారతీయులలో భారత దేశములో మోడీ గారు చేసున్న అభివృద్ధి , తెలంగాణ కు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మంచి జోష్ తో మాట్లాడుతూ బండి సంజ‌య్ అన్నను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు ఆర్.ఎస్.ఎస్ తీర్చిదిద్దిన మట్టిలో మాణిక్యం అని తెలుపుతూ, అసలు బిజెపి ఎక్కడ ఉంది అన్నోడికి చెంపపెట్టులో భాగ్య నగరం నడిబడ్డున ఉప్పెంగె కాషాయపు సముద్రం చూపిన కమలదళపతి మన సంజయ అన్న, సవాల్ కీ “సై అంటె సై” అని బీజేపీ ఎక్కడ, అన్నోడికి తెలంగాణ ఢంకా మొగించి రికార్డు స్థాయిలో మున్సిపల్ సీట్లు, అసెంబ్లీ ఎన్నికలో ఉత్కంఠబరమైన దుబ్బాక, హుజూరాబాద్ భారీ విజయం కైవసం చేసుకుని, మునుగోడు అసెంబ్లీ ఎన్నికలో నైతిక విజయం సాధించిన బండి సంజయ్ గారు అంటే మా గుండెలోతు ల్లో అభిమానం ఉంది, ఆ అభిమానాన్ని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు లో బండి సంజయ్ అన్న ఫోటోలు, బీజేపీ పైన ఉన్న అభిమానాన్ని చూపించాం. అదేవిధముగా మహాసంగ్రామ యాత్రలో 5 విడుతలు, యావత్ తెలంగాణలో తెలంగాణ ప్రజల గుండెలకు చేరువై 1000 KMS నడిచిన సందర్భుములో ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియాలో / సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ బండి సంజయ్ అన్నకు మద్దతు ఇవ్వడాన్ని గుర్తు చేసారు విలాస్ రెడ్డి.

అదేవిధముగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ తరుపున తెలంగాణ కమిటీ లు అమెరికా వ్యాప్తముగా 20 రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం, అందులో భాగముగా తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలలో చేస్తున్నాం, దీనికి అన్ని రాష్ట్రాలలో తెలంగాణ చాఫ్టర్ల యొక్క టీం /జట్టు సహాయ సహాకారాలు అని, వారి సహాయముతో పెద్ద ఎత్తున చేస్తున్నట్టు విలాస్ రెడ్డి తెలిపారు.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (OFBJP ) , తెలంగాణ బీజేపీ కోశాధికారి శాంతా కుమార, తెలంగాణ బీజేపీ కార్యదర్శి జయ శ్రీ గారు మిగితా తెలంగాణా మిత్రులు నిర్వాహించినా ఈ సభలో కృష్ణారెడ్డి అనుగుల (అఫ్-బీజేపీ జాతీయ పూర్వ అధ్యక్షులు ), విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ జాతీయ కన్వీనర్) , వంశీ యంజాల (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్), ప్రదీప్ రెడ్డి కట్ట (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కో-కన్వీనర్), మధుకర్ రెడ్డి (తెలంగాణ అఫ్-బీజేపీ మీడియా కో-కన్వీనర్ ), మరియు తెలంగాణ ఆఫ్-బీజేపీ సీనియర్ మద్దతు దారులు గోవింద్ రాజ్, ప్రవీణ్ తడకమళ్ల , ప్రవీణ్ అండపల్లి , కృష్ణ మోహన్ మూలే , రఘు కనుగొ, సంతోష్ రెడ్డి లింగాల, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, శంకర్ రెడ్డి, అదే విధముగా కమ్యూనిటీ లీడర్స్ శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, లక్ష్మి మోపర్తి, విజయ్ కుందూరు, హేమచందర్ రావు, గోపి మరియు ఆటా, నాటా, మాటా, టాటా తెలుగు సంఘాల నుండి వివిధ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని ఫోటోల www.NRI2NRI.com/Bandi Sanjay in New Jersey కొరకు ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected