Connect with us

Politics

AP స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి తో ఆత్మీయ సమావేశం విజయవంతం @ Atlanta, Georgia

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లతో కూటమి (National Democratic Alliance – NDA) నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 1 మంగళవారం సాయంత్రం స్థానిక అట్లాంటా (Johns Creek, Atlanta) లోని సంక్రాంతి రెస్టారెంట్ ఈవెంట్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 250 మంది హాజరయ్యారు.

ముందుగా ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులు సతీష్ ముసునూరి, సురేష్ పెద్ది స్వాగతోపన్యాసంలో భాగంగా వీక్ డే అయినప్పటికీ ఆఫీసు పనుల అనంతరం కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ (TDP), జన సేన పార్టీ (JSP) మరియు భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు పలువురు ప్రసంగించారు.

ఎన్నారై టీడీపీ అట్లాంటా నాయకులు మల్లిక్ మేదరమెట్ల మాట్లాడుతూ… గత ఎన్నికలనాటి పరిస్థితులను గుర్తు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.

తానా మాజీ అధ్యక్షులు, వాషింగ్టన్ డీసీ వాసి సతీష్ వేమన ప్రసంగిస్తూ… ఎన్నో సంవత్సరాలుగా ఎన్నారై టీడీపీ (NRI TDP) ప్లాట్ఫార్మ్ ద్వారా తెలుగుదేశం పార్టీ అభివృధ్హికి దోహద పడుతున్న జయరాం కోమటి (Jayaram Komati) కి నాకన్నా ముందే మంచి పదవి రావాలి అని మనసారా కోరుకుంటున్నానన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… గత ఎన్నికలలో ఎన్నారైల సేవలు మరువలేనివి అన్నారు. అలాగే తన తాత, నాన్న, బాబాయ్ లతో కలిసి పనిచేసిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తో కలిసి ప్రస్తుత ప్రభుత్వంలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు.

టీం అట్లాంటా జనసేన నాయకులు సురేష్ కరోతు ప్రసంగిస్తూ… తెలుగుదేశం పార్టీ పట్ల అయ్యన్న పాత్రుడు విశ్వాసానికి చరిత్రలో 40 పేజీలు తప్పక ఉంటాయన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) చెప్పినట్టు శాసన సభను హుందాగా నడిపిస్తూ ప్రజా సమస్యలపై చర్చలు జరిగేలా చూడాలన్నారు.

భారతీయ జనతా పార్టీ అట్లాంటా నాయకులు కార్తికేయ బండారు మాట్లాడుతూ… తిరుపతి లడ్డు అపవిత్రమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ని అభినందించారు. ఇటువంటివి జరగకుండా ఒక టిటిడి బోర్డు ని ఏర్పాటు చేయాలనీ, దానికి బీజేపీ (Bharatiya Janata Party) మద్దతు ఉంటుందన్నారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రసంగిస్తూ… ఎన్నికలు అవ్వగానే, కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే మన బాధ్యత పూర్తి కాలేదని, ఎన్నారైలు అందరూ మమేకమై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెట్టుబడులు పెట్టాలి అని కోరారు.

కాలిఫోర్నియా వాసి, ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ప్రసంగిస్తూ… ఎన్నారైల పాత్రను చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గుర్తించారని, అందుకనే ప్రస్తుతి అసెంబ్లీలో ఐదుగురు ఎన్నారైలు అడుగుపెట్టారన్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్ర శేఖర్ (Pemmasani Chandra Sekhar) ఐతే ఏకంగా కేంద్ర మంత్రి పదవిని అధిరోహించారన్నారు. అట్లాంటా ఎన్నారై రాము వెనిగండ్ల (Ramu Venigandla) గుడివాడలో మళ్ళీ టీడీపీ జండా పాతారన్నారు.

చివరిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లో 25 ఏళ్లకే యంగెస్ట్ ఎమ్మెల్యే మరియు 27 ఏళ్లకే యంగెస్ట్ మినిస్టర్ ని చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) ని, టీడీపీ (TDP) ని ఎలామరిచిపోతాం అన్నారు.

ప్రస్తుత గవర్నమెంట్ లో స్పీకర్ గా నా నోటికి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తాళం వేశారనడంతో సభలో నవ్వులు పూశాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన తను 11 సార్లు ఎన్నికలలో పోటీ చేస్తే 9 సార్లు గెలిచానన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులను, హాజరైన వారిని అభినందించారు.

అనంతరం కొందరు ఆహ్వానితులు అడిగిన పలు ప్రశ్నలకు చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ని శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. అందరూ ఫోటోలు దిగారు. చివరిగా డిన్నర్ అనంతరం వందన సమర్పణతో ఈ ఆత్మీయ సమావేశం విజయవంతంగా ముగిసింది.

అదే రోజు మధ్యాహ్నం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తో అట్లాంటా ప్రవాస వ్యాపారవేత్తలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు (Investments) పెట్టి అభివృధ్హిలో భాగస్వాములవ్వాలని కోరారు. లంచ్ కార్యక్రమంలో భాగంగా ఇన్వెస్టర్స్ తో ముఖాముఖీ (Investors Meet) సమావేశమయ్యారు.

error: NRI2NRI.COM copyright content is protected