ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, మాల్వేర్న్ నగరంలో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ వారు నవంబర్ 13వ తేదీన నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) గారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, అభివృద్ధి కనుమరుగైపోయిందని, మరల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని రాజేంద్రప్రసాద్ అన్నారు.
కనుక జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం, మాతృభూమి అభివృద్ధి కోసం ప్రతి ఒక్క ఎన్నారై టిడిపి సభ్యుడు నడుం బిగించి, రాబోయే ఎన్నికలలో క్రియాశీలకంగా పని చేయాలని అందుకోసం ఎన్నారై టిడిపి (NRI TDP) సభ్యులు ఎన్నికల ముందు ఒక నెల రోజులు ఇండియా వచ్చి తమ తమ గ్రామాలను దత్తత తీసుకొని తెలుగుదేశం పార్టీ విజయం కోసం అంకితభావంతో కృషి చేయాలని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నారై టిడిపి సభ్యులకు పిలుపునిచ్చారు.
రవి మందలపు (Ravi Mandalapu) గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది అని, రాష్ట్ర అభివృద్ధి కుంటి పడింది, రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సత్తా ఒక చంద్రబాబు గారికి మాత్రమే ఉంది అని ప్రజలు విశ్వసిస్తున్నారు అన్నారు. తెలుగుదేశం విజయం కోసం ఎన్నారై టిడిపి టీం చిత్తశుద్ధితో, అంకితభావంతో కష్టపడి పని చేస్తామని రాబోయే ఎన్నికలలో పార్టీని గెలిపించుకుంటామని రవి మందలపు గారు అన్నారు.
రవి పొట్లూరి (Ravi Potluri) గారు మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం, తెలుగు నేల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించి శ్రీ చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసేంతవరకు ఎన్నారై టిడిపి సభ్యులం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, రాజీలేని కృషి చేస్తామని తెలియజేశారు.
శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani) గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, ఎన్నారై టిడిపి సభ్యులందరూ ఎన్ని త్యాగాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రవి పొట్లూరి, శ్రీ రవి మందలపు, శ్రీ శ్రీధర్ అప్పసాని, శ్రీ సునీల్ కోగంటి, శ్రీ కిరణ్ కొత్తపల్లి, శ్రీనాథ్ రావుల, ప్రసాద్ క్రొత్తపల్లి, చలం పావులూరి, సంతోష్ రౌతు, విశ్వనాథ్ కోగంటి, అజిత్ పమిడిముక్కల, ఫణి పోలవరపు, అభిషేక్ కనగాల, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.