Connect with us

Government

చంద్రబాబు అప్రజాస్వామిక అరెస్టు సిగ్గుచేటు – Maryland NRI TDP

Published

on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, నవ్యాంధ్రప్రదేశ్‌కు కలిపి దాదాపుగా 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి అరెస్టును మేరీలాండ్ NRI TDP ముక్త కంఠంతో ఖండించింది. దార్శనిక నేతగా పేరుగాంచి తెలుగు జాతి అభివృద్ధికి గత 45 ఏళ్ళుగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న నిత్యకృషీవళుడైన చంద్రబాబు నాయుడి గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అత్యంత అప్రజాస్వామికమైన రీతిలో అరెస్టు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

దశాబ్దాలుగా మచ్చలేని నాయకునికి మకిలి అంటించాలని లెక్కకు మిక్కిలిగా ప్రయత్నించి నవ్వులపాలవడం ఈ ప్రభుత్వానికి అలవాటేనని, ఇది కూడా అటువంటి ప్రయత్నంలో భాగమేనని, ఎప్పటిలాగే తమ నాయకుడు కడిగిన ముత్యం లాగా ఈ అభియోగాల నుండి బయటపడతారని మేరీలాండ్ NRI TDP నేతలు ఉద్ఘాటించారు.

మేరీలాండ్ లోని పెర్సిస్ ఇండియన్ గ్రిల్‌ లో జరిగిన సమావేశంలో NRI TDP తెలుగుదేశం సభ్యులు దాదాపు 50 మంది పైగా పాల్గొని తెలుగు జాతి అభివృద్ధి కేవలం చంద్రబాబు గారి నాయకత్వంతోనే సాధ్యమని, చట్టానికి లోబడి శాంతియుతంగా నడుచుకోవాలని పిలుపునిచ్చిన తమ నేత తమకు స్ఫూర్తి అని నినదించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న NRI TDP నేతలు మాట్లాడుతూ.. తెలుగుజాతిని ప్రపంచ పటంలో ఎంతో ఎత్తున నిలపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహామనిషికి అన్యాయం జరగకుండా చూసుకోవడం ప్రతి తెలుగు వారి బాధ్యత అని, ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని పేర్కొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected