Connect with us

News

చంద్రబాబుతో మన్నవ మోహన కృష్ణ భేటీ, పార్టీని బలోపేతం చేయాలని సూచన

Published

on

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతం పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ చర్చించారు.

ఈ సందర్భంగా గుంటూరులోని రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలను అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్లారు. మన్నవ మోహనకృష్ణ ఎన్టీఆర్ ట్రస్ట్ కి అందిస్తున్న సేవలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయాన్ని చేస్తునందుకు చంద్రబాబు నాయుడు అభినందించారు.

వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారికి నష్టం కలిగింది, వ్యవస్థలు నాశనమయ్యాయి, రాష్ట్రం అంధకారంలో ఉంది, మళ్ళీ మంచి రోజులు రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఇదే స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికై, తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలని మోహన కృష్ణ ని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని మన్నవ మోహనకృష్ణ చంద్రబాబు గారితో అన్నారు.

తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్న వారికి ఖచ్చితంగా పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని, ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన మన్నవ మోహన కృష్ణకి సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వడం అభినందనీయం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected