Connect with us

News

బాబుతో NRI మన్నవ భేటీ, MLC లేదా గుంటూరు మేయర్ అవకాశంపై హామీ!

Published

on

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యాదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకుడు మన్నవ మోహన కృష్ణ సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు మన్నవ మోహన కృష్ణ తో మాట్లాడుతూ.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీకు మంచి పేరుంది, కానీ సామాజిక వర్గ సమతుల్యంలో భాగంగా ఈ నియోజకవర్గానికి B.C. అభ్యర్థిని ఎంపిక చెయ్యాల్సిన అవశ్యకత ఏర్పడింది. అందుకే B.C. అభ్యర్థిని ఎంపిక చెయ్యటం జరిగింది అని అన్నారు.

అనేక సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి అమెరికాలోనూ, ఆంధ్రాలోనూ అంకిత భావంతో పని చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఆర్ధికంగా అండగా వుంటూ, పార్టీకి ఎప్పుడు ఎలాంటి అవసరమున్నా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ, టీడీపీ కష్టకాలంలో వున్నప్పుడు కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ పట్ల అంకితభావంతో పని చేసిన నీకు తెలుగుదేశం పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే MLC పదవి కానీ గుంటూరు నగర మేయర్ పదవి కానీ తప్పకుండా ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు మన్నవ మోహన కృష్ణ కి హామీ ఇచ్చారు.

మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ అధినేత మాటను శిరస్సావహిస్తాను. తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలను చంద్రబాబు గారు గుర్తించి అభినందించటం చాలా సంతోషంగా వుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఎవరికిచ్చినా దగ్గరుండి మంచి మెజారిటీ తో గెలిపిస్తానని చంద్రబాబు గారికి చెప్పటం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కోసం నేను పడిన కష్టానికి టీడీపీ అధికారంలోకి రాగానే MLC పదవి గాని గుంటూరు నగర మేయర్ పదవి గాని ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం సంతోషంగా ఉందని మోహన కృష్ణ అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected