Connect with us

News

Dallas: ఘనంగా మహాత్మా గాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు

Published

on

Dallas, Texas: అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను డాలస్ లో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (Mahatma Gandhi Memorial of North Texas) అధ్వర్యంలో దశమ వార్షికోత్సవ వేడుకలు గత ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ నిర్మాణంలో సహకరించిన దాతలకు, అధికారులకు అభినందనపూర్వక విందు సమావేశం ఇర్వింగ్ నగరంలో ఉన్న విండాం హోటల్ (Wyndham Hotels & Resorts) లో ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో శ్రీకరి లంకా వీణానాదం; చక్రి పైలా శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు గాంధీ ఆశయాలపై చేసిన ప్రసంగాలు, రవీంద్ర గుడిమెళ్ళ, సమీర శ్రీపాద శిక్షణలో పాల్గొన్న సింధు గుడిమెళ్ళ, సంయుక్త గుడిమెళ్ళ, అన్షు చుండి, అయేషాని చుండి, సంహిత్ చిలకమర్రి, రిత్విక లక్కిరెడ్డి, అభినవ్ కార్తీక్ లక్కిరెడ్డి, సమన్విత మాడా, పవన్ కుమార్ గడగండ్ల, రవీంద్ర గుడిమెళ్ళ, శ్రీకర్ దేసు లు గానం చేసిన దేశభక్తి గీతాలు; సింధుజ ఘట్టమనేని శిక్షణలో పాల్గొన్న నందిత దినేష్, గ్రీష్మ అశోక్, తేజస్విని శర్వణన్, నక్షత్ర నల్లమోతు, నిత్య ఆవాల, ఆర్షియ మాచవోలు, ప్రియ దర్శిని కృష్ణమూర్తి, రుషిక కల్ల, సహన కార్తీక్, శ్రీనిత ఆర్కాటి, రియ బూర, వీక్షవ్ సురకంటి, ప్రణిత కొసరాజు, నేహశ్రీ పిల్లా, ప్రిష మదన్, సరయు తూనుగుంట్ల, అకిర తేర, నిహారిక కొండూరు, సాన్విక కొలన్పాక, ఆద్యవర్మ కొండూరు బృందం వందేమాతరం, జనగణమన గీతాలకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు (Cultural Programs) చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకత్వానికి దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు శుభాశ్సీసులు తెలియజేసిన ప్రత్యేక అతిథులుగా హాజరైన ఇర్వింగ్ (Irving) నగర మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్, కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ ఖబీర్, కాపెల్ నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో (Frisco) ఇండిపెండెంట్ స్కూల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఉపాధ్యక్షులు గోపాల్ పోణంగి లను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యులు మురళి వెన్నం (Murali Vennam), రన్నా జానీ, జాన్ హామండ్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, తాయాబ్ కుండావాల, సి.సి తియోఫిన్, స్వాతి షా, షబ్నం మాడ్గిల్ లు సత్కరించారు.

కాపెల్ (Coppell) నగర కౌన్సిల్ సభ్యులు బిజూ మాత్యు మరియు రమేశ్ ప్రేమ్ కుమార్ లు కాపెల్ నగర మేయర్ మహాత్మా గాంధీ మెమోరియల్ ను అభినందిస్తూ చేసిన అధికారిక అబినందన పత్రాన్ని (Proclamation), మరియు ఇర్వింగ్ నగర మేయర్ (Irving Mayor) వ్రాసిన ప్రశంసా పత్రాన్ని మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్ లు డా. ప్రసాద్ తోటకూర కు అందజేశారు.

ఇటీవలే గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులుగా నియమితులైన రాంకీ చేబ్రోలు, జాన్ హామండ్, రన్నా జానీ, కిషోర్ కంచర్ల, తిరుమలరెడ్డి కుంభం, లోకేష్ నాయుడు కొణిదల (Lokesh Naidu Konidala), అనంత్ చౌదరి మల్లవరపు, అక్రం సయ్యద్, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట్ల, వినోద్ ఉప్పు, రాజేంద్ర వంకావాల లను డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) సభకు పరిచయం చేసి తోటి సభ్యులతో కలసి వారందరినీ సన్మానించారు.

మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని తయారుచేసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత, విజయవాడ (Vijayawada) కు చెందిన బుర్రా శివ వరప్రసాద్, గుజరాత్ (Gujarat) కు చెందిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోనీను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (Mahatma Gandhi Memorial of North Texas) బోర్డ్ సభ్యులందరూ కలసి ఘనంగా సన్మానించారు. షబ్నం మాడ్గిల్ వందన సమర్పణతో, రుచికరమైన విందు భోజనంతో దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

error: NRI2NRI.COM copyright content is protected