Published
2 years agoon
By
NRI2NRI.COM. యుగపురుషునికి పెద్ద ఎత్తున నివాళులు
. 2500 మందికి పైగా హాజరు
. రాము వెనిగండ్ల, గౌతు శిరీష, అన్నాబత్తుని జయలక్ష్మి ముఖ్య అతిథులు
. అమెరికాలోని పలు నగరాల నుంచి సైతం విచ్చేసిన అభిమానులు
. వేదిక ప్రాంగణం అంతా ఎన్టీఆర్ మయం
. ఆకట్టుకున్న ఎన్టీఆర్ థీమ్ కార్యక్రమాలు
. కళాకారులకు, వివిధ సంఘాల ప్రతినిధులకు ఘనంగా సన్మానం
. ఎన్టీఆర్ కి టాలీవుడ్ సింగర్స్ మ్యూజికల్ ట్రిబ్యూట్
. త్వరలో NTR విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు
ఎన్టీఆర్! ఈ మూడక్షరాల పేరు వినగానే ప్రతి తెలుగోడి వెంట్రుకలు కూడా నిక్కబొడుచుకుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao). మరి అలాంటి శకపురుషుని శతజయంతి వేడుకలంటే మాటలా!
NTR Trust Atlanta వారికి అన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించాలనే ఆలోచన రావడం, అనుకుందే తడవుగా సంకల్పించడం, అదే ధృడ సంకల్పంతో 2500+ మందితో అట్లాంటాలో రీసౌండ్ వచ్చేలా మే 13 శనివారం రోజున స్థానిక లాంబర్ట్ హై స్కూల్లో అత్యంత విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం.
ముందుగా మాలతి నాగభైరవ ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి, NTR Trust Atlanta కమిటీ సభ్యులను మరియు ముఖ్య అతిథులను వేదికమీదకు ఆహ్వానించగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇదే సమయంలో విఘ్నేశ్వరుని స్తుతిస్తూ గీతాలాపన చేశారు. అలాగే కమిటీ సభ్యులందరూ ఎన్టీఆర్ పఠానికి పూలతో నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జీవితాన్ని ప్రతిబింభిస్తూ చేసిన వీడియో ప్రదర్శనతోపాటు పలు స్థానిక డాన్స్ స్కూల్స్ వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలలోని పాత్రలను కళ్ళకు కట్టినట్టు చేసిన నృత్య రూపకం ఈ కార్యక్రమానికే హైలైట్.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుడివాడ నియోజకవర్గ నాయకులు, వెనిగండ్ల ఫౌండేషన్ ఛైర్మన్ వెనిగండ్ల రాము, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష మరియు గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళ ప్రెసిడెంట్ అన్నాబత్తుని జయలక్ష్మి ల పరిచయ వీడియోలను ప్రదరించి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించగా వీరు సభనుద్దేశించి ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు.
వీరితోపాటు అట్లాంటా ప్రముఖులు మోహన్ దేవు ఎన్టీఆర్ కీర్తిని వివరిస్తూ ఆ యుగపురుషుని అద్భుత విజయాలను, ప్రజాహిత పాలనను అందరూ మరోసారి నెమరువేసుకునేలా చేశారు. ఈ సందర్భంగా వీరందరినీ పుష్పగుచ్చం, శాలువా మరియు మెమెంటోతో ఘనంగా సన్మానించారు.
మధ్య మధ్యలో ప్రదర్శించిన ఎన్టీఆర్ కి సంబంధించిన స్పెషల్ ఏవీలు చనిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ప్రజల మనస్సులో ఎలా జీవిస్తున్నారో తెలియజెప్పాయి. అట్లాంటాలోని పలు స్థానిక మరియు జాతీయ సంఘాల (Telugu Associations) ప్రతినిధులందరినీ వేదికపైకి ఆహ్వానించి వారి సేవలను కొనియాడుతూ సన్మానించారు.
నందమూరి తారక రామారావు (NTR) కూడా కళారంగానికి చెందిని వారు కాబట్టి అట్లాంటాలోని కళాకారులైన స్థానిక గాయనీ గాయకులను, సంగీత మరియు నృత్య పాఠశాలల గురువులను, సాహితీవేత్తలను ఇలా పలువురిని ఘనంగా సన్మానించారు. పిల్లలకు ఫేస్ పెయింటింగ్ ఏర్పాటు చేయడంతో కోలాహలంగా తిరుగుతూ కనిపించారు.
2000 మందికి పైగా బంతి భోజనాలు, అందునా చివరి బంతి వరకు కూడా ప్రతి ఐటమ్ సరిపడేలా వడ్డించడం అసమానవీయం. నాన్ వెజ్ తో కూడిన పసందైన భోజనాలందించిన సంక్రాంతి రెస్టారెంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డ ని అభినందించాల్సిందే.
టాలీవుడ్ గాయనీగాయకులు ధనుంజయ్ మరియు వైష్ణవి ల మ్యూజికల్ ట్రిబ్యూట్ అందరినీ ఒక్కసారి ఎన్టీఆర్ యుగానికి తీసుకెళ్లినట్లయింది. కొన్ని దశాబ్దాల క్రితం పాటలను సైతం అవలీలగా పాడి అందరినీ అలరించిన ధనుంజయ్ మరియు వైష్ణవి లను అభినందిస్తూ సన్మానించారు.
న్యూ జెర్సీ, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, డల్లాస్, షార్లెట్, చికాగో, సెయింట్ లూయిస్, బర్మింగ్ హామ్ వంటి నగరాల నుండి పలువురు ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ అట్లాంటా కార్యక్రమంలో పాల్గొనడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లుతుంది. వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమ స్పాన్సర్స్ ని సన్మానించారు.
వీరిలో డా. నరేన్ కొడాలి, డా. ప్రసాద్ నల్లూరి, రాజా కసుకుర్తి, జానీ నిమ్మలపూడి, పురుషోత్తమ చౌదరి గుదే, శ్రీనివాస్ కూకట్ల, ఠాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, రాజా సూరపనేని, డా. ఉమ కటికి ఆరమండ్ల, బాల, శ్రీ కళ్యాణ్ లింగమనేని తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఎన్టీఆర్ గురించి చేసిన ప్రసంగం ఆహుతులలో ఉత్తేజాన్ని నింపింది.
ఈ కార్యక్రమానికి ఆడియో, వీడియో, ఫోటోగ్రఫీ, LED స్క్రీన్స్, డెకొరేషన్ సేవలందించిన బైట్ గ్రాఫ్ (ByteGraph) ప్రశాంత్ కుమార్ కొల్లిపర అండ్ టీం, ఫోటోగ్రఫీ సేవలందించిన శ్రీ ఫొటోస్ సురేష్ ఓలం అండ్ టీం మరియు లాంబర్ట్ హై స్కూల్ క్రూ లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఇండియాలో తయారుచేపిస్తున్నట్లు, త్వరలోనే అట్లాంటా తెప్పించి పెద్ద ఎత్తున విగ్రహ ఆవిష్కరణ చేస్తామని NTR Trust Atlanta సభ్యులు భరత్ మద్దినేని సభాముఖంగా వీడియో ప్రదర్శించి తెలియజేశారు. ఒక సంస్థ (NTR Trust Atlanta) తరపున ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ గావించడం అమెరికాలో ఇదే మొట్టమొదటిసారి కానుండడం విశేషం అన్నారు.
అట్లాంటా మహానగరంలో 2008 లోనే NTR Trust స్థాపించి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే, ఇప్పుడు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, అన్న స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 100వ పుట్టినరోజు వేడుకలు (Centennial Birthday Celebrations) నిర్వహించిన తీరు మరొక ఎత్తు అయ్యింది.
ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మరియు సహకరించిన వారిలో అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, అనిల్ యలమంచిలి, భరత్ మద్దినేని, మధుకర్ యార్లగడ్డ, శరత్ పుట్టి, ఇన్నయ్య ఎనుముల, రవి కల్లి, సాయిరాం కారుమంచి, సురేష్ బండారు, సుబ్బారావు మద్దాళి, వెంకట్ మీసాల, సురేష్ ధూళిపూడి, శ్రీనివాస్ రామిశెట్టి, కిరణ్ గోగినేని, శ్యామ్ మల్లవరపు, మహేష్ కొప్పు, రామ్ మద్ది, నగేష్ దొడ్డాక, వెంకట్ పోలాకం, సునీల్ దేవరపల్లి, శ్రీరామ్ రొయ్యల, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, సునీత పొట్నూరు, పూలని జాస్తి, ప్రియాంక గడ్డం, పూర్ణ వీరపనేని, సుధాకర్ బొర్రా, తిరుమల కొసరాజు, రామ్ నెక్కంటి, సూర్య, కృష్ణ ఇనపకుతిక, శశికుమార్ రెడ్డి దగ్గుల, వినయ్ మద్దినేని, రాజేష్ జంపాల, గిరి సూర్యదేవర, విజయ్ కొత్తపల్లి, మురళి బొడ్డు, సుధాకర్ బొడ్డు, వెంకీ గద్దె, సాయిబాబు మాదినేని, విజయ్ కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, భరత్ అవిర్నేని, బాల మద్ద, చందు అవిర్నేని, శ్రీనివాస్ జీవీ, ముఖర్జీ వేములపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, రుపేంద్ర వేములపల్లి, తిరు చిల్లపల్లి, వెంకట్ గోక్యాడ, వెంకట్ నల్లూరి ఇలా మొత్తంగా దాదాపు 100 మంది వలంటీర్లు ఉన్నారు.