Connect with us

Politics

అట్లాంటా ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నారా లోకేష్ పర్యటన

Published

on

ఫిబ్రవరి 2న అట్లాంటాలో నారా లోకేష్ గారితో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక అట్లాంటా ఎన్నారై తెలుగుదేశం నాయకత్వంలో జరిగిన ఈకార్యక్రమానికి నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. వారాంతం కానప్పటికీ, అందరూ ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నప్పటికీ మరియు సభాస్థలి దూరమైనప్పటికీ ఎముకలు కొరికే చలిలో అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో హాజరై నారా లోకేష్ గారికి కమనీయమైన స్వాగతం పలికారు మన అట్లాంటా తెలుగుదేశం పార్టీ అభిమానులు. అందుకేనేమో ఆ తాతకి తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడిని చూడడానికి షార్లెట్, హ్యూస్టన్, జాక్సన్విల్, రాలీ మరియు నాష్విల్ లాంటి సుదూరప్రాంతాలనుండి కూడా అభిమానులు తరలి వచ్చారు. అలాగే విజయవాడ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమా గారి కుమారులు బోండా సిద్దు హాజరవడం విశేషం.

ముందుగా రాజేష్ జంపాల మరియు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేయగా, అట్లాంటా ఎన్నారై తెలుగుదేశం నేతలు మరియు అభిమానులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారకరాముని చిత్రపటానికి పుష్పాంజలితో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సమైఖ్యఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మరియు ఆ యుగపురుషుని చరిత్ర మీద ఒక ప్రత్యేక వీడియోని ప్రదర్శించారు. సభాస్థలి మొత్తం తెలుగుదేశం జండాలు, పసుపు చొక్కాలు, కండువాలతో పసుపు మయం కావడం విశేషం.

సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా స్వాతి కారి, నీలిమ గడ్డమణుగు, చరిత రాగ్యారి మరియు శ్రీవల్లి కంసాలి వారి విద్యార్థులు ప్రదర్శించిన సామూహిక ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అలాగే వెంకట్ చెన్నుభొట్ల మరియు భానుశ్రీ వావిలకొలను అన్నగారి చిత్రాలలోని కమ్మని పాటలతో అందరిని మంత్రముగ్ధులను చేసారు. మధ్యమధ్యలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ, జన్మభూమి, చంద్రబాబు పాలన, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రదర్శించిన వీడియోలు అందరు ఆసక్తిగా తిలకించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం మరియు రైతులు భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడానికి సంబంధించిన వీడియో అందరిని ఆకట్టుకుంది.
ఇంతలో ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు వేదికవద్దకు వస్తున్నారని తెలుసుకొని సుమారు వందకు మంది పైగా ఎదురువెళ్ళి పురోహితులతో పూర్ణకుంభ స్వాగతం పలకగా, అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలతో నమస్కరించి ఆసీనులయ్యారు. అట్లాంటా హిందూ దేవాలయ వేదపండితులు నారా లోకేష్ గారికి ఆశీర్వచనం గావించారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు డా. రవికుమార్ వేమూరు గారు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఏపీఎన్నార్టీ పాత్రను వివరించారు.
తదనంతరం మల్లిక్ మేదరమెట్ల లోకేష్ గారిని సభకు పరిచయం చేయగా, లోకేష్ గారు మైకు అందుకోగానే జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై బాలయ్య, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది. లోకేష్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దడానికి అపరభగీరధునిలా కృషి చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి  ఎల్లవేళలా తోడ్పాటు అందించాలని మరియు ఎన్నారైల సాంకేతిక విజ్ఞానాన్ని నవ్యాంధ్రప్రదేశ్ లో ఉద్యోగరూపకల్పనకు వాడాలని కోరారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం, డ్వాక్రా కమిటీలు, పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా, వడ్డీలేని రుణాలు లాంటి ప్రజోపయోగ్యమైన కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే సురేష్ పెద్ది ఆధ్వర్యంలో జరిగిన ప్రస్నోత్తర కార్యక్రమంలో అభిమానులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చారు. తర్వాత కలుపుగోలుగా మాట్లాడుతూ, యోగక్షేమాలు కనుక్కుంటూ ప్రతి ఒక్కరితో రెండు గంటలపాటు ఫోటోలు దిగడం ఈసమకాలీన రాజకీయాల్లో గర్వించదగ్గ విషయం. అట్లాంటా తెలుగుదేశం అభిమానులందరూ కలిసి నారా లోకేష్ గారిని పుష్ప గుచ్చం, జ్ఞాపిక, శాలువా మరియు గజమాలతో సత్కరించగా కేక్ కట్ చేసి శుభాబివందనాలు తెలియజేసి నిష్క్రమించారు.
చివరిగా వ్యాఖ్యాత వెంకీ గద్దె ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన శ్రీనివాస్ లావు, మల్లిక్ మేదరమెట్ల, అంజయ్య చౌదరి లావు, అనిల్ యలమంచిలి, సాయిరాం సూరపనేని, సురేష్ పెద్ది, శరత్ పుట్టి, వినయ్ మద్దినేని, మురళి బొడ్డు, శ్రీకాంత్ వల్లభనేని, సురేష్ కర్రోతు, శరత్ అనంతు, శ్రీనివాస్ రాయపురెడ్డి,  హితేష్ వడ్లమూడి, వెంకట్ మీసాల, దుశ్యంత్ నర్రావుల, ఉపేంద్ర నర్రా, నగేష్ దొడ్డాక, సుబ్బారావు మద్దాళి,  బిల్హన్ ఆలపాటి, గోపి కృష్ణ పిన్నిటి, ఆనంద్ అక్కినేని, సుధాకర్ బొర్రా, రామ్ మద్ది, భరత్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, భరత్ అవిర్నేని, రాజు మందపాటి, సంధ్య ఎల్లాప్రగడ, రవి కిరణ్ మొవ్వ, వెంకట్ అడుసుమిల్లి, మురళి కిలారు, అరుణ్ ఉయ్యూరు, మనోజ్ తాటికొండ, శివ మాలెంపాటి, ఫణి బొబ్బ, విజయ్ కొత్తపల్లి, రాఘవ పుల్లెల, టీవీ5 ప్రవీణ్ పురం, టీవీ9 శివ కుమార్ రామద్గు గార్లకు, ఆడియో మరియు లైటింగ్ అందించిన క్రిస్టల్ క్లియర్ ప్రొడక్షన్స్ నుంచి దేవానంద్ కొండూర్, టిల్లు, అందమైన ఫొటోలతో ఈకార్యక్రమాన్నంతటిని తమ కెమేరాల్లో బంధించిన కిషోర్ తాటికొండ, వాకిటి క్రియేషన్స్ రవికిరణ్  వడ్డమాను, వేదికను మరియు రుచికరమైన భోజనాలను అందించిన ఏషియానా బాంక్వెట్ హాల్ యాజమాన్యానికి, ముఖ్యంగా ఈకార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన సభికులందరికి కృతఘ్నతలు తెలియజేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected