Connect with us

Politics

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అమెరికా పర్యటన వివరాలు

Published

on

కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అమెరికా పర్యటనకు బయలుదేరారు . పది రోజుల పాటు ఆయన యూఎస్‌లోనే ఉండనున్నారు. శుక్రవారం సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బండి సంజయ్ యూఎస్‌కు ప్రయాణం అయ్యారు. శనివారం సెప్టెంబర్ 2 అట్లాంటాలో జరిగే ఆప్త (American Progressive Telugu Association) 15వ వార్షికోత్సవంలో బీజేపీ ఎంపీ ప్రసంగించనున్నారు.

ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (Overseas Friends of BJP) ఆధ్వర్యములో పబ్లిక్ మీటింగ్ జరుగబోతున్నట్లు ఆఫ్-బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్, ఆఫ్-బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి ఏనుగుల తెలిపారు. అందులో భాగముగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, లీడ్ వాలంటీర్ లు శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదీని ఆధ్వర్యములో ఐదు రాష్ట్రాలలో ఆరు పట్టణాలలో ఆత్మీయ సదస్సులు (Meet & Greet) జరుపనున్నారు.

సెప్టెంబర్ 3న అట్లాంటాలో, సెప్టెంబర్ 4న వివేక్ హాల్ (Charlotte) నార్త్ కారోలిన, సెప్టెంబర్ 5న సీసన్స్ @ తాండూర్ బంక్యూట్ హాల్ (Raleigh) నార్త్ కెరోలినా , సెప్టెంబర్ 6న (Fairfax) వర్జీనియా, సెప్టెంబర్ 8న (హాలిడే ఇన్ హాజలెట్) న్యూ జెర్సీ, సెప్టెంబర్ 9న (Plano, Dallas) టెక్సాస్ లో జరిగే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ లో శ్రీ బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు.

పలు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవా, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.అలాగే అమెరికా లోని వివిద నగరాలలో పూర్వ విద్యార్ది పరిషత్ నాయకులు, ముఖ్యంగా తెలంగాణా ఉద్యమకారులను ఎన్నారైలతో మాట్లాడుతారు. అమెరికా పర్యటనను ముగించుకుని సెప్టెంబర్ 10న ఆయన స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారు.

వీరి పర్యటనకు వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నతెలుగు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రవాస విద్యార్ది పరిషత్ పూర్వ విద్యార్దులు మరియు భారతీయ జనతా పార్టీ మిత్ర సంఘం కు చెందిన మిత్రులు వంశీ యంజాల, శ్రీనివాస్ నాతి , రాజు కుర్రపాటి, సుభాష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి యేలు , లష్మినారాయణ పెరి, సాయి సూదిని, అజయ్, శేఖర్ నల్లబోతుల, వినయ్, సంపత్, సుధాకర్, రఘు , వికాస్, కార్తికేయ, వికాస్, శ్యామసుందర్ , నికేత్ సాయిని, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట , శ్రీకాంత్ తుమ్మల, రమేష్ కలవల, సంతోష్ వేముల, కృష్ణా గుడిపాటి, ఉపేన్ నందిపల్లి, ఓం నక్క , గోవింద్ రాజులూ , రఘు, విజయ్ కుందూరు శరత్ వేముల, గోపి సముద్రాల, రామ్ వేముల, కృష్ణా , శంకర్ రెడ్డి, ఆదిత్య , రామకృష్ణ జి వి స్,గోపి చిలుకూరు , శ్రీనివాస్ , శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదీని, జంబుల విలాస్ రెడ్డి అమెరికాలో వివిధ నగరాలలో ఏర్పాట్లు చూస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected