ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో లిటిల్ హాండ్స్ ఆర్గనైజషన్ (LHO) అనే స్వచ్చంద సంస్థ వారు ‘చారిటీ డిన్నర్’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగా బ్రదర్, నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Nagendra Naga Babu) పాల్గొన్నారు.
ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల తోపాటు ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2600 పైగా వాలంటీర్స్ కలిగి ఉన్న ఈ సంస్థ సమాజంలో యువత కు వివిధ రకాల అంశాలు పై సామాజిక అవగాహనా కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
ఈ సారి వచ్చిన ఫండ్ తో ఆర్తి ప్రాజెక్ట్ ద్వారా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తునట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని మెగా బ్రదర్ నాగబాబు సంస్థ 12 వ వార్షికోత్సవం సందర్బంగా మెల్బోర్న్ లో లాంచనం గా ప్రారంభింపజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడిన నాగబాబు యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సమాజం పట్ల యువత బాధ్యతతో ఉంటూ సేవాకార్యక్రమాలలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.
ఈ లిటిల్ హాండ్స్ ఆర్గనైజషన్ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి LHO సంస్థ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.