మనిషి మనుగడ, నడత మారిపోయెను.
ఇళ్ళు విశాలం ఆయెను, మనసులు ఇరుకు ఆయెను.
పరిసరాల పరిశుభ్రత ఎక్కువాయెను, మనసులో మాలిన్యం పేరుకుపోయెను.
బహిరంగ ప్రదర్శనలే మనిషి ధ్యేయం ఆయెను, అంతరంగ సంఘర్షణలో ఓడిపోయెను.
తుంటరి చేష్టల మనుషులే చలామణి ఆయెను, నైతిక విలువలు మరుగున పడెను.
ప్రతిష్ఠలు, అవసరాలు, బాధ్యతల మధ్య ఆశయాలు, వ్యక్తిత్వ వికాసం అరుదైపోయెను.
సాంకేతిక వలలో చిక్కుకొని, అవసరాలకు మాత్రమే సంబంధాలు ఏర్పరచుకొనెను.
కుంటు పడిన ఈ వ్యవస్తలో అభ్యుదయమైన మార్పు రావాలని, రాక తప్పదని వీక్షిస్తూ…
మల్లికా రెడ్డి
(సంభవామి యుగే యుగే)