మనిషి జీవితంలో పెదవి దాటని మాటలు ఎన్నో చెప్పడం సాధ్యమా!
మానసిక సంఘర్షణ, యాతన ముఖ వర్చ్చస్సుతో పోల్చడం న్యాయమా!
వెలుగు-నీడలు, కష్ట-సుఖాలు, అనురాగం-అవమానం జీవన ద్వంద్వత్వానికి నిదర్శనాలు!
అంతర్గత సుడిగుండాలని అధిగమించిన మనిషి సమాజంలో అరుదు!
బహిర్గత కల్మషాలను, అంతర్గతం కానివ్వకు సుమా!
సమాజం అనే తామరాకు మీద నీటి బిందువుగా అమరిపో!
ఆత్మలో పరమాత్మ స్థిరపడినప్పుడు దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం!
- మల్లికా రెడ్డి
(సంభవామి యుగే యుగే)