Connect with us

Literary

సాహితీ స్రవంతి; తానా కన్వెన్షన్లో సాహిత్య కార్యక్రమాలకు పెద్ద పీట

Published

on

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటు చేశారు. సాహిత్య కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. సాహితీ స్రవంతి పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాలు జూలై 8వ తేదీన, జూలై 9వ తేదీన వైభవంగా జరగనున్నాయి.

శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు జరుగు కార్యక్రమానికి అధ్యక్షులుగా వాసిరెడ్డి నవీన్‌ వ్యవహరిస్తున్నారు. అమెరికాలో తెలుగు కథకులు అంశంపై తాడికొండ శివకుమార శర్మ, డయస్సోరా కథలు అంశంపై సాయి బ్రహ్మానంద్‌ గొర్తి, కవితాపఠనం అంశంపై వసీరా, తమ్మినేని యదుకుల భూషణ్‌ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు మేడసాని మోహన్‌ అవధాన కార్యక్రమం ఉంటుంది.

జూలై 9వ తేదీ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.00 వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిగురుమళ్ళ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించనున్నారు. మనుస్మృతి మంచి చెడు అంశంపై ముత్తేవి రవీంద్రనాథ్‌, తెలుగు నాటకం అంశంపై దీర్ఘాశి విజయ్‌కుమార్‌, పద్యనాటకం అంశంపై మీగడ రామలింగస్వామి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 11.00 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు సంభాషణ పేరుతో ఓ కార్యక్రమం జరుగనున్నది.

ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా జంపాల చౌదరి వ్యవహరిస్తున్నారు. అతిధులుగా తానా గిడుగు రామమూర్తి స్మారక అవార్డు గ్రహీత మన్నెం వెంకట రాయుడు, తానా బహుమతిని గెలుచుకున్న రచయిత చింతకింది శ్రీనివాసరావు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు పాటల అంశంపై కార్యక్రమం జరగనున్నది.

కొసరాజు సినిమా పాటలు అంశంపై విజయ చంద్రహాస్‌ మద్దూరి, జానపదం అంశంపై అందెశ్రీ, పేరడీలు అంశంపై జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 వరకు తెలుగు సాహిత్యంలో యువస్వరాలు అంశంపై కార్యక్రమం జరుగుతుంది. వాసిరెడ్డి నవీన్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో బీరం సుందరరావు కవిత్వం అంశంపై, కథలు అంశంపై మల్లిఖార్జున్‌, కవితపఠనం ఏనుగు నరసింహారెడ్డి, కళ్యాణ్‌ మాట్లాడనున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected