సింగర్ కార్తీక్ లైవ్ కాన్సర్ట్ అట్లాంటా (Atlanta) లో నిర్వహిస్తున్నారు. అమెరికా టూర్ లో ఉన్న కార్తీక్ (Playback Singer Karthik) గత వారాంతం డల్లాస్ లో పాల్గొన్న లైవ్ కాన్సర్ట్ బ్లాక్క్బస్టర్ విజయాన్నందుకుంది. ఏప్రిల్ 7, ఆదివారం రోజున అట్లాంటాలోని గ్యాస్ సౌత్ అరీనా (Gas South Arena) లో ఏర్పాటు చేస్తున్న ఈ లైవ్ కాన్సర్ట్ ని మాధవి కొర్రపాటి (Madhavi Korrapati) ప్రజంట్ చేస్తున్నారు.
లేటెస్ట్ సెన్సేషనల్ గాయకులు కార్తీక్ (Playback Singer Karthik) మరియు తన బ్యాండ్ గ్యాస్ సౌత్ అరీనా (Gas South Arena) లో శ్రోతలను పాటల పల్లకీలో తిప్పనున్నారు. ఇంకెందుకు ఆలస్యం. అసలే టికెట్స్ దాదాపు సోల్డ్ అవుట్. వివరాలకు www.NRI2NRI.com/Singer Karhik Live Concert in Atlanta ని సందర్శించండి.