Connect with us

Patriotism

Washington DC లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

Published

on

అక్టోబర్ 2 ని పురస్కరించుకొని అమెరికా రాజధాని Washington DC ప్రాంతంలో ప్రవాస భారతీయులు, వారి తల్లి దండ్రులు గాంధీజీ (Mohandas Karamchand Gandhi) కి, శాస్త్రీజీ కి ఘన నివాళి అర్పించారు. మహనీయులు ప్రాణత్యాగాలతో సాధించి పెట్టిన స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఫలాలు ఈనాడు దశాబ్దాలుగా మన మందరం అనుభవిస్తున్నామని తెలిపారు.

వారి స్ఫూర్తి తరతరాలకూ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమాన్ని భాను ప్రకాష్ మాగులూరి సమన్వయపరచారు. భాను ప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ… భరత మాత తల రాతను మార్చిన విధాత.. జగజ్జేత.. జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపి, ఆచరించి, ప్రబోధించిన మహనీయుడు అన్నారు.

అలాగే ఆశ్రమ దీక్ష, స్వతంత్ర కాంక్ష, ఆకృతి దాల్చిన అవధూతగా శతాబ్దాల బ్రిటిష్ (British) పాలకుల చెరను ఛేదించిన శాంతి కాముకుడుగా.. ఆయన త్యాగనిరతి, స్వాతంత్య్ర (Independence) పోరాట భావాలు, అంకితభావం, సమైక్యతా నినాదం భారత జాతికి ఆదర్శ మని భాను ప్రకాష్ మాగులూరి (Bhanu Prakash Maguluri) అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు మాట్లాడుతూ… మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) ఉన్నత వ్యక్తిత్వంతో, నిజాయితీ గల నడవడికతో ఆదర్శ జీవితాన్ని గడిపిన మహనీయుడు. ఆయన నినాదం జై జవాన్ జై కిసాన్ (Jai Jawan Jai Kisan) బహు ప్రాచుర్యం పొందిందన్నారు.

గాంధీజీ (Mahatma Gandhi) పిలుపుతో కాంగ్రెస్ లో చురుకైన, పరిపక్వత గల సభ్యునిగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం (Quit India Movement) లో పాల్గొని స్వాతంత్రోద్యమ స్ఫూర్తి చాటి చరిత్రలో నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) చిత్ర పఠాలకు పూలతో ఘన నివాళులు అర్పించారు.

error: NRI2NRI.COM copyright content is protected