ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. బ్లడ్ ప్రెజర్ తగ్గడంతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొణిజేటి జులై 4, 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఆర్థిక మంత్రిగా, ఎంపీగా కొణిజేటి సేవలందించారు. సెప్టెంబర్ 2009 నుండి జూన్ 2011 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆగస్ట్ 2011 నుంచి ఆగస్ట్ 2016 వరకూ తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు.