Tirupati, Andhra Pradesh: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీం (Sri Balaji Arogya Vara Prasadini Scheme) కు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన కియోరా ఇఫ్రా కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ డా. కోడెల శివరామకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు.
తిరుపతి టిటిడి (Tirumala Tirupati Devasthanams – TTD) పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) కు దాత విరాళం డీడీని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా డా. కోడెల శివరామకృష్ణను (Dr. Kodela Sivaram) టిటిడి ఈవో అభినందించారు.