తానా 2021 ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ నుంచి ఫౌండేషన్ ట్రస్టీగా కిరణ్ గోగినేని పోటీచేస్తున్నారు. అట్లాంటాకు చెందిన కిరణ్ ప్రస్తుతం 2019-2021 కి గాను సౌత్ఈస్ట్ తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. స్థానిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా), ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా (ఐఫా) తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో తానా ఫౌండేషన్ ద్వారా నిర్వహించే సేవల విస్తృతి పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయా అవసరాలకు అనుగుణంగా తానా ఫౌండేషన్ను బలోపేతం చేసేందుకు స్థానిక సృజనాత్మక ఆలోచనలతో పాటు ప్రపంచీకరణ సాయం కూడా తీసుకోవల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు. తానా ఫౌండేషన్ బలోపేతానికి సరికొత్త సాంకేతికతతో పాటు సభ్యుల తోడ్పాటు కూడా అవసరమని, ఆ దిశగా కృషి చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని వినియోగిస్తానని అన్నారు.