Connect with us

News

కర్ణాటిక్ శాస్త్రీయ సంగీతంతో 4 ప్రపంచ రికార్డులు సాధించిన కళ్యాణి ముడుంబ: Bloomington, Illinois

Published

on

Bloomington, Illinois: ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ వాస్తవ్యురాలు కళ్యాణి ముడుంబ ఆసియా & ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Asia Book of Records) ద్వారా నాలుగు ప్రపంచ రికార్డులు కర్ణాటిక్ శాస్త్రీయ సంగీత కార్యక్రమాలతో సాధించింది. మొదటి రెండు ప్రపంచ రికార్డులు (World Records) గత సంవత్సరం జులై 2023 లో “అష్టోత్తర శత సంకీర్తన” అను సంగీత కార్యక్రమం ద్వారా కైవసం చేసుకుంది.

తరువాతి రెండు ప్రపంచ రికార్డులు ఈ మార్చి 2024 లో ఆసియా & ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (India Book of Records) వారు ‘సుందర సేతు ‘ శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని విశిష్ట కార్యక్రమంగా గుర్తించి, “CARNATIC CONCERT TO RAISE FUNDS FOR THE TALLEST STATUE OF LORD HANUMAN OUTSIDE INDIA” అను కేటగిరిలో కళ్యాణి ముడుంబ కు అందచేసారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి సంకల్పంతో ప్రస్తుతం 90 ఫీట్ అభయ ఆంజనేయ పంచ లోహ మూర్తి హ్యుస్టన్ నగరంలో “Statue of Union” గా రూపు దిద్దుకుంటుంది. ఈ తొంబై అడుగుల ‘అభయ ఆంజనేయ” పంచ లోహ విగ్రహ ప్రతిష్ట కు విరాళాలు సేకరించడానికి 90 నిమిషాల ‘సుందర సేతు” శాస్త్రీయ సంగీత కార్యక్రమము గత సంవత్సరం డిసెంబర్ నెలలో, క్వాడ్ సిటి (మొలిన్) లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అశేష ఆహుతుల నడుమ వివిధ భాషల్లో కళ్యాణి ముడుంబ (Kalyani Mudumba) శ్రీ రామ నామ సంకీర్తనలు హృద్యంగా పండిత పామర జనరంజకంగా ఆలపించింది.

ఈ Carnatic Music సంగీత ఝరి అందరినీ ఆద్యంతం ఆహ్లాదపరించిది. కర్ణాటిక్ శాస్త్రీయ సంగీత కార్యక్రమాల ద్వారా అటు సంగీత సేవ చేస్తూ, ఇటు సమాజ సేవ కూడా చేస్తున్న కళ్యాణి ముడుంబ (Kalyani Mudumba) ను అందరూ ఎంతగానో వేనోళ్ల కొనియాడారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected