కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గిరపడేకొద్దీ కమలనాథుల్లో కలవరం పెరుగుతోందట. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అంశాల్లో భాజపా సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని వంచనకి గురిచేసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఆంధ్రులు ఏళ్ల తరబడి కర్ణాటకలో స్థిరపడి ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ బలంగా నమ్ముతున్నారు. దాదాపు 30 నియోజక వర్గాలలో విజేతలను నిర్ణయించే పరిస్తిథిలో ఉన్నారు. దీంతో సైలెంట్ వోటింగ్ జరిగి తెలుగు వారంతా కమలనాథులకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు చంద్రబాబు నాయుడుని కొంచెం స్లో అవ్వమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహంని దూతగా పంపినప్పటికీ అదేమీ కుదరదంటూ తెగేసి చెప్పడంతో కమలనాథుల్లో కలవరం మరీ పెరిగిపోయిందట.