Connect with us

Financial Assistance

కందుకూరు బాధితులకు NRI TDP జయరాం కోమటి సహాయం అందజేత

Published

on

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కందుకూరు సభ ప్రమాద బాధితులకు NRI TDP USA తరుపున ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వెంటనే అందించారు.

ప్రకటించినట్టుగానే 8 కుటుంబాలకు 8 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య మరియు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లకు కృష్ణ గొంప ద్వారా ఈరోజు అందజేశారు. టీడీపీ కార్యాలయం ద్వారా ఈ సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తారు. ముందు ముందు కూడా అవసరం మేరకు NRI TDP సహాయం చేస్తుందన్నారు.

కందుకూరు ప్రమాదము ఊహకందని విషాదం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ధైర్యం కలిగించాలి. తెలుగుదేశం అనేది కేవలం రాజకీయ పార్టీ కాదు, ఇది మన అందరి కుటుంబం. మన తోటి వారిని అకస్మాత్తుగా కోల్పోవటం చాలా బాధ కలిగించే విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని జయరాం కోమటి అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected