Connect with us

Donation

ఇంజనీరింగ్ విద్యార్థినికి జయ్ తాళ్ళూరి సహాయం

Published

on

తానా ఫౌండేషన్ ‘ఆదరణ’ కార్యక్రమంలో భాగంగా భారతావనిలో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు జయ్ తాళ్ళూరి ఒక పేద విద్యార్థికి సహాయం చేసారు. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మండలం, కండ్లకోయ గ్రామవాసి పూజిత వల్లంకొండ అనే ఇంజనీరింగ్ విద్యార్థినికి జయ్ తాళ్ళూరి లాప్టాప్ బహుకరించారు.

డిసెంబర్ 26న హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సహాయం చేసారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని మరియు తెలంగాణ ట్రిబ్యునల్ జడ్జి పూర్ణచందర్ తాళ్ళూరి చేతులమీదుగా పూజితకి లాప్టాప్ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి వంశీ వల్లూరుపల్లి తదితరులు పాల్గొన్నారు. పూజిత ఈ సందర్భంగా జయ్ తాళ్ళూరి మరియు తానా ఫౌండేషన్ పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపింది.

error: NRI2NRI.COM copyright content is protected