Connect with us

Politics

జనసేన MP వల్లభనేని బాలశౌరి తో ఘనంగా ముఖాముఖి @ Atlanta, Georgia

Published

on

టీం అట్లాంటా జనసేన (Team Atlanta Janasena – TAJ) ఆధ్వర్యంలో ఎన్.డి.ఎ కూటమి సభ్యులైన తెలుగుదేశం, బిజెపి లు కలసి సంయుక్తంగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జనసేన మచిలీపట్నం లోక్ సభ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashowry) గారుని ఘనంగా సత్కరించడం జరిగింది.

అమెరిక పర్యటనలో భాగంగా జనసేన (JanaSena) లోక్ సభ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, టీం అట్లాంటా జనసేన సభ్యుల విజ్ణప్తి మేరకు అట్లాంటా (Atlanta) కి రావడం జరిగింది. రెఫ్లెక్షన్స్ ఈవెంట్ సెంటర్లో టీం అట్లాంటా జనసేన నిర్వహించిన కార్యక్రమానికి ఎన్.డి.ఎ అట్లాంటా భాగస్వాములు తెలుగుదేశం మరియు బిజెపి సభ్యులు విరివిగా పాల్గొన్నారు.

మొదటగా టీం అట్లాంటా (Atlanta) జనసేన నుంచి కరోతు సురేష్ (Karothu Suresh) గారు స్వాగతోపాన్యాసం చేస్తూ టీం అట్లాంటా జనసేన (TAJ) ఆవిర్భావం నుండి నేటి వరకు చేసిన విభిన్న కార్యక్రమాలు, 2019 మరియు 2024 ఎన్నికలలో భాగస్వామ్యం గురించి విఫులంగా వివరించారు.

పిమ్మట వేదిక మీదకు తాజ్ కార్యకర్తలు శ్రీ మండపాటి వెంకటపతి రాజు మరియు శ్రీ దూళిపూడి సురేష్ (Dhulipudi Suresh) వేదికను అలంకరించి మాట్లాడుతూ తాజ్ భవిష్యత్తు ప్రణాళికలు గురించి చెప్పడం జరిగింది. అలాగే బిజెపి ఆదిలాబాద్ లోక్ సభ కన్వీనర్ శ్రీ నంద చాట్ల (Nanda Chatla) గారు వేదికను అలంకరించి మాట్లాడుతూ అమెరికా నుండి ఆంధ్రాకి విమాన సదుపాయం గురించి కోరడం జరిగింది.

అప్త (American Progressive Telugu Association – APTA) మాజీ అధ్యక్షులు మరియు జనసైనికులు శ్రీ కొట్టె ఉదయ్ బాస్కర్ (Kotte Udayabhaskar) గారు మాట్లడుతూ మొన్నటి ఎన్నికలలో 25 ప్రచార రధాలు “కొణిదెల విజయం కొట్టె లక్ష్యం” గురించి వివరించారు. తానా మాజీ అద్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి (Lavu Anjaiah Chowdary) గారు మాట్లాడుతూ తెలుగుదేశం నాయకత్వంతో తనకున్న అనుభవాలను ఉటంకిస్తూ, ఎం.పి గారిని అమరావతి పై ప్రత్యేక దృష్టిని పెట్టవలసిందిగా విజ్ణప్తి చేసారు.

అట్లాంటా టిడిపి నుండి శ్రీ ముసునూరి సతీష్ (Musunuri Satish) గారు మాట్లాడుతూ… రాబోవు ఐదు ఏళ్ళలో అభివృద్ది జరగడంపై దృష్టిని కేంద్రీకరించాలని సభా ముఖంగా కోరుకున్నారు. టీం అట్లాంటా జనసేన, తెలుగుదేశం, మరియు బిజెపి కలసికట్టుగా ఎం.పి శ్రీ బాలశౌరి (Vallabhaneni Balashowry) గారిని సత్కరించారు.

శ్రీ బాలసౌరి (Vallabhaneni Balashowry) గారు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ది, రాష్ఠంలో గ్రామాలు పట్టణాలకు కలపడానికి రోడ్ సౌకర్యం మరియు పోలవరం ప్రొజెక్టును పూర్తిచేయటం కూటమి ముఖ్యాంశాలుగా చెప్పారు. అలాగే ఇలా కూటమి భాగసామ్య పార్టీలు కలిసికట్టుగా సమవేశం ఏర్పాటు చెయ్యడంపై తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

పని వారమైన గురువారం సుమారు 300 మంది ఎన్.డి.ఏ కూటమి సభ్యులు హాజరు కావడంపై టీం అట్లాంట జనసేన (TAJ) కు అభినందనలు తెలియపరిచారు. ఆ తరువాత ప్రశ్న మరియు సమాధానం కార్యక్రమంలో భాగంగా సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపి గారు చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది.

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కుమారి అక్షిత మరియు శ్రీమతి ప్రియ గారు చక్కటి పాటలు పాడి ఆహూతులను అలరించారు. నేటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా జనసైనికులు కరోతు సురేష్ (Karothu Suresh) గారు మరియు వీర మహిళ ప్రియ గారు ఆహుతులను మెప్పించారు.

డిన్నర్ విభాగాన్ని శ్రీ రవి కల్లి, శ్రీ వెంకట్ గోక్యాడ చక్కగా నిర్వహించి చక్కటి భోజన సదుపాయం కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలను శ్రీ శివ పూల గారు నిర్వహించారు. వక్తలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) గారిని ఎంతగానో కొనియాడారు.

ఆయన కూటమికి మరియు ఆంద్రప్రదేశ్ అభివృద్దికి చేస్తున్న కార్యక్రమాలపై మన్నలను కురిపించారు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గార్ల అనుభందం కలకాలం నిలవాలని ఆంద్రప్రదేశ్ అభివృద్దిలో పాలుపంచుకోవాలని ప్రగాడంగా కోరుకొన్నారు.

ఎంతటి కార్యక్రమానికైన దాతలు (Sponsors) ఆవశ్యకత ఎంతైనా ఉంది. జనసేన (Jana Sena Party – JSP) కార్యక్రమం అనగానే ముందుకు వచ్చి విజయవంతం చెయ్యడానికి సహకరించిన దాతలకు మరొక్కసారి తాజ్ (Team Atlanta Janasena) సభ్యుల తరుపున ధన్యవాదములు తెలియజేశారు.

వేదిక స్పాన్సర్ రిఫ్లెక్షన్స్ మరియు ఐ.డి.ఎస్, ఫుడ్ స్పాన్సర్స్ చిచ్చాస్ రెస్టారెంట్, ఇండియన్ ఫ్లేవర్స్, పిస్తా హౌస్ మరియు పక్కా లోకల్, లాజిస్టిక్ స్పాన్సర్ గరుడవేగ, మిడియా పార్ట్నర్ NRI2NRI.COM, కార్యక్రమ స్పాన్సర్స్ శ్రీ చిన్మయ మంచాల గారు, ఫోటోగ్రఫీ ఎస్.వి క్లిక్స్, డి.జె. శ్రీని పసుపులేటి గారు మరియు మండపాటి వెంకటపతి రాజు గారు మరియు తాజ్ సభ్యులు.

స్పాన్సర్స్ (Sponsors) అందరినీ వేదిక మీదకు ఆహ్వానించి సత్కరించారు. పనివారమైనా సరే విచ్చేసిన కూటమి (National Democratic Alliance – NDA) కార్యకర్తలకు మరియు సానుభూతిపరులకు మరొక్కసారి అభినందనలు తెలియజేసి భోజనానంతరం కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.