Connect with us

Government

Pawan Kalyan: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండించిన జనసేనాని

Published

on

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇలాంటి రౌడీ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ చేపట్టాలన్నారు. ఈ మధ్య వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటి ఇలాంటి వాటిపై పోలీస్ శాఖ సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. పార్టీలకతీతంగా దాడులను పవన్ కళ్యాణ్ ఖండించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేనానిని అభినందిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected