అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పిచ్చి కాకపొతే సాక్షాత్తు పార్లమెంటులో చేసిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికే విలువ లేదు! ఇంకా సమాచార హక్కు కింద కేంద్ర ప్రభుత్వ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని ఊగిసలాడితే మాత్రం ఏమి ఉపయోగం. ఇదిగో తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్, మాగంటి మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు పార్లమెంటు, స్పీకర్ సాక్షిగా ఇచ్చిన సమాధానాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.