Connect with us

Government

భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అతిథిగా న్యూజెర్సీ లో మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్

Published

on

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ న్యూ జెర్సీ (New Jersey) లో కాన్సులేట్ జనరల్, పెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) అధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎన్నో సంస్థల నుండి ప్రముఖులు, కార్యకర్తలు, ప్రవాస భారతీయలు దాదాపు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

అమెరికా (United States of America) కాలమానం ప్రకారం అర్ధ రాత్రి అయినప్పటికీ ముఖ్య అతిథిగా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్ (Subrahmanyam Jaishankar) పాల్గొన్నారు. న్యూ యార్క్ (New York) కౌన్సిల్ జనరల్ రణధీర్ జైస్వాల్, న్యూ యార్క్ సెనెటర్ కెవిన్ థామస్, జెన్నిఫర్, ఎడిసన్ మేయర్ శామ్ జోషి, తరుణ్ జీథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected