అట్లాంటాలోని జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ పోస్ట్స్ మరియు మేయర్ పదవికి నవంబర్ 2న ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో ముగ్గురు భారతీయ అమెరికన్లు పోటీచేయనున్నట్లు తెలిసింది. దిలీప్ టుంకి మొదటి కౌన్సిల్ పోస్ట్ కి, రష్మీ సింగ్ రెండవ కౌన్సిల్ పోస్ట్ కి, అలాగే బాబ్ ఎర్రమిల్లి మూడవ కౌన్సిల్ పోస్ట్ కి పోటీచేయడానికి అర్హత సాధించారు.
రెండు దశాబ్దాలకు పైగా జాన్స్ క్రీక్ సిటీలో నివసిస్తున్న దిలీప్ టుంకి అందరికీ సుపరిచితులే. ఎందుకంటే 2019 లో జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ పోస్ట్స్ 2 కి పోటీ చేసి ఇటు డిబేట్స్ లో పాయింట్ టు పాయింట్ అదరగొట్టడమే కాక అటు క్లోజ్ ఎలక్షన్ తో రన్నాఫ్ వరకు తెచ్చి ప్రత్యర్థికి చెమటలు పుట్టించారు. మరిన్ని వివరాలకు https://tunkiforjc.comని సందర్శించండి.
అమెరికా మెరీన్ కార్ప్స్, నావీలో సేవలందించిన వెటరన్ బాబ్ ఎర్రమిల్లి. జెట్ స్పీడుతో నిర్ణయాలు తీసుకోగలిగిన వాళ్ళే ఎయిర్ ఫోర్స్ లో ఇమడగలరు అనే నానుడితో, 14 సంవత్సరాలు కంబాట్ జెట్స్ నడిపిన యోధుడు బాబ్ ఎర్రమిల్లి. తదనంతరం పూర్తి భిన్నమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వృత్తిలో రాణించడం విశేషం. మరిన్ని వివరాలకు http://www.boberramilli.com/ ని సందర్శించండి.
రష్మీ సింగ్ సుమారు 20 సంవత్సరాలకు పైగా టెక్నాలజీ కంపెనీస్ లో నాయకత్వ విధుల్లో పనిచేసారు. ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే జార్జియా రాష్టంలోనే మొట్టమొదటి భారతీయ అమెరికన్ గా రెకార్డుల్లోకెక్కుతారు. మరిన్ని వివరాలకు https://www.rashmiforjohnscreek.com/ ని సందర్శించండి.