Connect with us

Government

అమెరికాలో నరేంద్ర మోడీ కి ఘన స్వాగతం పలికేలా ప్రవాసుల ఏర్పాట్లు

Published

on

భార‌త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 21న అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నారు.

అమెరికా న్యూయార్క్ లో ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద “ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ” ఆధ్వర్యములో మోడీ గార్కి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ విధముగా అమెరికాలో 20 పట్టణాలలో వివిధ ప్రసిద్ధి గాంచిన స్థలాల్లో చేపట్టి మంగళవారం మోడీ గారు న్యూయార్క్ వచ్చి జూన్ 21 వ రోజు యోగ దినోత్సవ కార్యకమంలో పాల్గొంటారు.

తర్వాత మోడీ కి వైట్‌హౌస్‌లో 22న అధ్యక్ష దంపతులు గౌరవ విందు ఇస్తారు. మోడీ యాత్ర కోసం యావత్ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని ప్రసాద్ అడపా చెప్పారు.

జూన్ 21న మోడీ విమానం దిగే వైమానిక స్థావరం వద్దకు వెళ్లి స్వాగతం చెప్పడానికి భారతీయ అమెరికన్లు సిద్ధమవుతున్నారు అని కృష్ణా రెడ్డి ఏనుగుల మరియు విలాస్ జంబుల తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected