Connect with us

Patriotism

TAMA @ Atlanta: భారత రాజ్యాంగం ఒక దిక్సూచి, ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published

on

అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 26న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత ఖ్యాతిని పొంది అనేక జాతులు, అనేక కులాలు, అనేక భాషలు విభిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించడంలో భారత రాజ్యాంగం (Constitution) ఒక దిక్సూచిగా పని చేసిందని ప్రవాస భారతీయులు కొనియాడారు.

ఖండాంతరాలలో ఉన్నా మాతృదేశం మీద మమకారంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు (India Republic Day Celebrations) నిర్వహించారు. ప్రపంచ గురువుగా భారతీయ ఖ్యాతిని చాటి చెప్పారు. అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న అమెరికాలో గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరగటం ఆనందదాయకం.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తామా (Telugu Association of Metro Atlanta) అధ్యక్షులు సురేష్ బండారు (Suresh Bandaru) ముందుగా ముఖ్య అతిధులను పరిచయం చేసి, అనంతరం హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు ప్రాణాలను అర్పించడంతోపాటు పోరాడి సాధించారని వివరించారు.

ఆ మహనీయుల స్ఫూర్తితో భారత దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు పాటుపడాలని పిలుపునిచ్చారు. భారతదేశం అంటే ఒక దేశం కాదని సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలకి ఆదర్శనీయమని వివరించారు. అలాగే తామా (Telugu Association of Metro Atlanta – TAMA) ఆధ్వర్యంలో రాబోయే కార్యక్రమాల గురించి విపులీకరించారు.

ఈ వేడుకలకు తరలివచ్చిన ప్రవాసీయులకు మరియు టీం సభ్యులకు తామా బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు ఉప్పు (Srinivas Uppu) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం దేవ్ రాపురి గారు మరియు మోహన్ దేవు గారు జెండా వందనం గావించగా అందరూ జాతీయ గీతం ఆలపించి భారతావనిపై తమకున్న గౌరవాన్ని తెలియజెప్పారు.

ముఖ్య అతిథిగా హాజరైన దేవ్ రాపురి గారు మాట్లాడుతూ… ప్రపంచంలో మనిషికి డబ్బు శాశ్వతం కాదు అని కుటుంబ విలువలు మరియు ప్రేమానురాగలు ముఖ్యమని అని తెలుపుతు అవి తమ పిల్లలకు నేర్పించాలి అని పేర్కొంటూ 16 సంవత్సరాలుగా వైమానిక దళంలో పనిచేసి దేశ సంరక్షణలో భాగంగా కార్గిల్ యుద్ధంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్ లో పాల్గొనడంతో పాటు అత్యున్నత భారత చట్టసభ పార్లమెంట్ పై జరిగిన దాడిలో ప్రాణాలకు వడ్డి మరి పోరాడినట్టు చెప్పి భారతీయ సంతతికి స్ఫూర్తిని అందించేలా మాట్లాడారు.

మరో విశిష్ట అతిథులు మోహన్ దేవు గారు మరియు చైతన్య చెర్లోపల్లి గారు మాట్లాడుతూ… భారతదేశం స్వాతంత్ర సంగ్రామం స్ఫూర్తిదాయకమని నేటి తరానికి కూడా స్వేచ్ఛ వాయువుల అందించిన మహోన్నత ఉద్యమము అన్నారు. భావితరాలకు కూడా స్ఫూర్తిని అందించేలా ప్రత్యేక గణతంత్ర వేడుకలను జరుపుకోవడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం అన్నారు. డబ్బు శాశ్వతం కాదని విలువలు దేశ ఔన్నత్యం పెంపొందించటమే ప్రతి భారతీయుడి ఆకాంక్షగా ఉండాలన్నారు.

తామా (TAMA) సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గాయనీమణులు శ్రీమతి గౌరి కారుమంచి మరియు శ్రీమతి పావని బండి ఆలపించిన దేశభక్తి గేయాలు ఆహుతుల్ని అలరించాయి. అలాగే ఎంతోమంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. గణతంత్ర దినోత్సవానికి హాజరైన వారందరికీ పటేల్ బ్రదర్స్ వారు అల్పాహారాన్ని సమకూర్చారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులు శ్రీనివాస్ ఉప్పు, సురేష్ బండారు, చలమయ్య బచ్చు, ప్రియాంక గడ్డం, సునీత పొట్నూరు, రవి కల్లి, ఇన్నయ్య ఎనుముల, యశ్వంత్ జొన్నలగడ్డ, వెంకట శివ గోక్వాడ, కృష్ణ ఇనపకుతిక, సాయిరామ్ కారుమంచి, శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి, రూపేంద్ర వేములపల్లి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, మధు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/TAMA Republic Day 2024 ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected