Connect with us

Patriotism

నాట్స్‌ & ఇతర సంస్థల ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు @ Tampa Bay, Florida

Published

on

ప్రతి సంవత్సరం భారతీయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను అమెరికాలోని స్థానిక భారతీయ సంస్థలు ఘనంగా నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే వేడుకులను టాంపా బే, ప్లోరిడాలో (Tampa Bay, Florida) జరిపాయి. మాటా (MATA), నాట్స్ టాంపా బే విభాగం, మేలోడి మాక్ టైల్‌ (Melody Mocktail) తో పాటు వివిధ స్థానిక భారతీయ సంస్థలు ఈ వేడుకలను నిర్వహించాయి.

ఏ దేశమేగినా ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే విధంగా ప్రవాస భారతీయులు తమ దేశ భక్తిని చాటుతూ చేసిన ప్రదర్శనలు, జెండా వందనం అందరిని ఆకట్టుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, అమెరికాలోని అవకాశాలను అందిపుచ్చుకోవడం అనే అంశాలను కాన్సూల్ జనరల్ రమేశ్ బాబు లక్ష్మణన్ (Ramesh Babu Lakshmanan) ఈ వేడుకల్లో చక్కగా వివరించారు.

ప్రవాస భారతీయులకు కాన్సూల్ జనరల్ రమేశ్ బాబు ఎన్నో సేవలు చేస్తున్నారని, వారి సంక్షేమం కోసం చేస్తున్న కృషి మరువలేనిదని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రశంసించారు. మాటా (Mana American Telugu Association) చాప్టర్ ప్రెసిడెంట్ టోని జాను, ప్రశాంత్ పిన్నమనేని తో కలిసి రమేశ్ బాబు లక్ష్మణన్‌ను సత్కరించారు. దాదాపు ఐదు వందల మందికి పైగా తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

భారతీయ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో (India Independence Day Celebrations) భారతీయ నృత్యం, పాటలు, వాద్యవిన్యాసాలు, భారతీయ జెండాలతో చేసినప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. స్థానికంగా Tampa Bay ప్రవాస భారతీయుల (NRIs) సంక్షేమానికి కృషి చేసిన వారిని ఈ వేడుకల్లో భాగంగా సత్కరించారు. ఈ వేడుకల్లో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమం కోసం తమ వంతు సహకారాన్ని అందించిన వారిలో నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ మాజీ ఛైర్మన్ & నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ / మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి రాజేష్ కాండ్రు, ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ సుమంత్ రామినేని ఉన్నారు.

అలాగే నాట్స్ (North America Telugu Society – NATS) సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, భార్గవ్ మాధవరెడ్డి, అనిల్ అరెమండ, భరత్ ముద్దన, మాధవి యార్లగడ్డ, మాలినీ రెడ్డి, సతీష్ పాలకుర్తి, సుధాకర్ మున్నంగి, ప్రసాద్ నేరెళ్ల, రవి కలిదిండి, కిరణ్ పొన్నం, నవీన్ మేడికొండ మరియు ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected