Connect with us

Patriotism

ఘనంగా భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు @ Dallas, Texas

Published

on

Dallas, Texas: టెక్సస్ రాష్ట్రంలో, డాలస్ నగరంలో నెలకొని ఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial of North Texas) వద్ద భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు (Republic Day Celebrations) శుక్రవారం, జనవరి 26న ఘనంగా జరిగాయి.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ “డా. బి. ఆర్ అంబేద్కర్ (Bhimrao Ramji Ambedkar) అధ్యక్షతన ఎందరో మేధావులు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి భారత రాజ్యాంగాన్ని తయారుచేసి మనకు అందించారని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఫౌరుడిమీద ఉంది” అన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని (Constitution) రూపొందించిన నేతలకు, మన భారతదేశ స్వాతంత్ర సిద్ధికి పాటుపడిన మహాత్మాగాంధి (Mahatma Gandhi), జవహర్లాల్ నెహ్రు (Jawaharlal Nehru), సర్దార్ వల్లభాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, మౌలానా అబుల్ కలం ఆజాద్ మొదలైన నాయకులకు, దేశ స్వాతంత్రం కోసం అశువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు ప్రవాస భారతీయులు ఘన నివాళులర్పించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వాల, రాజీవ్, బి.ఎన్, జగదీష్, నవాజ్, జస్టిన్, షబ్నం మోడ్గిల్, వివిధ భారతీయసంస్థల నాయకులతో పాటు ఎంతోమంది ప్రవాస భారతీయులు (NRIs) ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected