Connect with us

News

ఆతిధ్యం = గోదారోళ్లు, అల్లుడికి 365 వంటలతో సంక్రాంతి భోజనం

Published

on

ఆతిథ్యానికి మారుపేరు గోదావరి జిల్లాల వాళ్ళు. అందులోనూ సంక్రాంతి పండుకకి ఇంటికి వచ్చే అతిథులకు, మరీ ప్రత్యేకంగా అల్లుళ్లకు రకరకాల వంటలతో విందు భోజనం వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. సామాన్యంగానే అల్లుళ్లంటే మర్యాదలెక్కువ. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ.

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన అత్యం వెంకటేశ్వరరావు, మాధవి ల కుమార్తె కుందవికి తణుకుకు చెందిన తుమ్మలపల్లి సాయి కృష్ణతో వివాహం నిశ్చయమైంది. కుందవి తాతయ్య గోవింద్, అమ్మమ్మ నాగమణి కాబోయే వధూవరులను తమ ఇంటికి ఆహ్వానించి 365 రకాల వంటలతో విందు భోజనం ఏరాటు చేసారు. 100 రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతో పాటు రకరకాల పిండి వంటలతో ఆతిథ్యమిచ్చారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected